రాష్ట్రీయం

5కోట్ల ఆంధ్రుల గొంతు వినిపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న శుక్రవారం రోజు చాలా కీలకమైందని, అన్ని పార్టీల నేతలను కలవాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎంపీలతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇదొక చారిత్రక అవకాశమని, అందరి మద్దతు కూడగట్టాలని, ఏపీకి సంఘీభావం కోరాలని సూచించారు. ఇది స్ఫూర్తిదాయక సమయమని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రం, ప్రజలు ఎదుర్కొంటున్న విభజన సమస్యలపై 5కోట్ల మంది గొంతుక ఒక్కటిగా వినిపిద్దామని చెప్పారు. ఆరోజు పార్లమెంట్‌లో బిల్లు ఎలా ఆమోదం పొందిందో గుర్తుచేయాలన్నారు. నాలుగేళ్లలో జరిగిన అన్యాయాన్ని వివరించాలన్నారు. ఎవరిలోనూ మన పట్ల వ్యతిరేకత ఉండకూడదని, వీలైతే తోడ్పాటు లేదా వారు తటస్థంగా ఉండేలా వ్యవహరించాలని కోరారు. తానుకూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడతానని, సంఘీభావం కోరతానని చెప్పారు. అవిశ్వాసంపై చర్చ 7 గంటలు జరిగే అవకాశం ఉందని, మనకు 15నిముషాలు మాట్లాడే అవకాశం ఇస్తారన్నారు. కానీ మరింత ఎక్కువ సమయం కావాలని అడగాలని సూచించారు. చర్చలో పాల్గొనే ఎంపీలు పూర్తిగా సంసిద్ధులు కావాలని, చట్టంలోని అంశాల అమలు గురించి అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును చర్చించాలని, ఎంపీలందరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాష్ట్రం ఒకటే కాదు దేశం అంతా లోక్‌సభ వైపు చూస్తోందన్నారు. మన కళ్లముందు రాష్ట్ర ప్రయోజనాలే కనిపించాలని, ఎంపీల దృష్టి అంతా 5కోట్ల మంది ప్రజల భవిష్యత్తుపై ఉండాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఎంపీలు సద్వినియోగం చేసుకోవాలని, ఐదు కోట్ల మంది మన ప్రజల గొంతు లోక్‌సభ వేదికగా కేంద్రానికి వినిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.