రాష్ట్రీయం

చాలా రోజుల తర్వాత సచివాలయానికి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చాలరోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయానికి వచ్చారు. ఇంటి వద్దనే పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నేరుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహం ముందు నివాళులర్పించారు. అక్కడి నుండి సిఎం నేరుగా అసెంబ్లీకి వెళ్లారు. ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్‌ను స్వాగతం పలికి స్పీకర్ ఛాంబర్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుండి గవర్నర్ నేరుగా సభలోకి వెళ్లి శాసనసభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు. అంతకుముందు సిఎంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ప్రధానకార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు సమావేశమై కార్పొరేషన్ కార్యకలాపాలను వివరించారు. మంత్రి నారాయణ ఈ సందర్భంగా ఇటీవల ఉద్యోగులతో జరిగిన సమీక్షా సమావేశాల విశేషాలను సిఎంకు చెప్పారు.

సీమపట్ల ముఖ్యమంత్రి వివక్ష
వామపక్షాల నేతల విమర్శ
కర్నూలు సిటీ, మార్చి 5: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి, సీమ సమగ్రాభివృద్ధికి రూ.50వేల కోట్ల నిధులు కేటాయించి, సీమలోని సాగునీటి ప్రాజెక్టులైన హాంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి, సీమలో జిల్లాకు ఒకటి చొప్పున భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతనెల 20 నుంచి సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ బస్సు యాత్ర ముగింపు సభను శనివారం కర్నూలు పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు మత కలహాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ధనికుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, రైతన్నలకోసం నామమాత్రంగా నిధులు కేటాయించటం శోచనీయమన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనం ఉద్యమిస్తుంటే, గ్రామానికి ఒక బెల్ట్‌షాపు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు.

గతంలో ఫ్యాక్షన్ నేతలుగా ఉన్న వారందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కొనసాగుతుంటే వారి నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.

అనపర్తిలో రత్నాచల్‌కు హాల్ట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 18నుంచి అనపర్తి స్టేషన్‌లో నిలుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆరు నెలల పాటు ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వెల్లడించింది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అనపర్తి స్టేషన్‌లో ఉదయం 8.40కి వచ్చి, నిమిషం ఆగుతుంది, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.10కి వచ్చి ఒక్క నిమిషం ఆగి బయలుదేరుతుంది.

గవర్నర్ ప్రసంగమంతా అసత్యాల

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: గవర్నర్ చేసిన ప్రసంగం అసత్యాలతో కూడి ఉందని, అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని వైకాపా నేతలు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాటాడుతూ వాస్తవాలను గవర్నర్ ప్రతిబింబింప చేయలేకపోయారని అన్నారు. ్ర ప్రగతి రెండంకెల్లో సాధించాలని అనుకున్నామని, కాని అవినీతి రెండంకెల్లో సాధించామని ముఖ్యమంత్రి క్యాబినెట్ భేటిలోనే ఒప్పుకున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో మాత్రం అవినీతిని సమూలంగా తుడిచిపెట్టినట్టు చెప్పడం చూస్తే ఆత్మను చంపుకోవడమేనని అన్నారు. జాతీయ వృద్ధిరేటు 7.31 శాతం ఉంటే ఆంధ్రాలో మాత్రం 10.99 శాతం సాధించామని చెబుతున్నారని అది ఎంతవరకూ వాస్తవమని ప్రశ్నించారు. ఓ వైపు జీతాలు కూడా ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ మరోవైపు జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్టు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. వ్యవసాయ రంగంలో దిగుబడి తగ్గిపోయిందని, ఆ విషయం చెప్పడం లేదని అన్నారు. సాగువిస్తీర్ణం తగ్గిందని, రైతు ఆదాయం తగ్గందని, నిత్యావసరాల రేట్లు పెరిగాయని ఇవేవీ ప్రస్తావించలేదని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో తామిచ్చేది కేవలం లక్ష మాత్రమేనని, మిగిలింది రుణంగా అందిస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. కరవు లేదని చెబుతున్నారని, అనంతపురం జిల్లా నుండి నాలుగు లక్షల మంది ఎందుకు వలసవెళ్లారో చెప్పడం లేదని అన్నారు. రుణ మాఫీ గురించి ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.