రాష్ట్రీయం

దేశంలో పరీక్షల సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు తమ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అనుసరిస్తున్న విధానాల వల్ల అనేక వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో పరీక్షల సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నడుం బిగించింది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం ఎం సాలుంఖే అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను అక్టోబర్ నాటికి అందజేస్తుంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా యూజీసీ (నివేదిక ఇచ్చే సమయానికి హెచ్‌ఇసిఐ పరీక్షల నిర్వహణ, సంస్కరణలపై యూనివర్శిటీలకు మార్గదర్ళకాలను జారీ చేయనుంది.
ప్రస్తుతం కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఒక తీరుగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక తీరుగా, ప్రైవేటు వర్శిటీలోనూ, డీమ్డ్ వర్శిటీల్లోనూ మరో తీరుగాపరీక్షల విధానం అమలులో ఉంది. కొన్ని యూనివర్శిటీలు సీబీసీఎస్ విధానాన్ని అనుసరిస్తుండగా, కొన్ని యూనివర్శిటీలు సెమిస్టర్ విధానాన్ని, మరికొన్ని ఇంటర్నల్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అలాగే పరీక్ష పత్రాల ప్యాటర్న్‌లో కూడా అనేక మార్పులు ఉన్నాయి. యూజీ, పీజీ, డిప్లొమో కోర్సుల ప్రశ్నాపత్రాల ప్యాటర్న్ ఒక్కో రీతిన ఉంటోంది. కొన్ని కోర్సుల్లో మూడు విభాగాలుగా ప్రశ్నలు ఇస్తుండగా, మరికొన్ని యూనివర్శిటీలు రెండు విభాగాలుగా ప్రశ్నాపత్రాలను రూపొందిస్తున్నాయి. వేర్వేరుగా ఉన్న ప్రశ్నపత్రాల రూపాన్ని ఏకరూపతకు తీసుకురావడం, మూల్యాంకనంలో ఆధునిక పద్ధతులను అనుసరించడంతో పాటు సారూప్యతకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది.

7529 సూచనలు
దేశంలో ఉన్నత విద్యా కమిషన్ తీసుకువస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఇంత వరకూ కేంద్రానికి 7529 సూచనలు అందాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లు యూజీసీ చైర్మన్‌ను కలిసి వేర్వేరుగా నివేదికలను అందించాయి. రెండు రాష్ట్రాలూ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటును వ్యతిరేకించాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. యూజీసీ ఇంత వరకూ నిర్వహిస్తున్న విధులను రెండు సంస్థలకు అప్పగించాలని కేంద్ర యోచిస్తోంది. ప్రమాణాల పర్యవేక్షణకు ఒక సంస్థను, నిధుల మంజూరుకు మరో సంస్థను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉన్నత విద్యా కమిషన్‌కు సంబంధించిన బిల్లును తెచ్చే యోచనలో కేంద్రం ఉంది.