రాష్ట్రీయం

తోట నర్సింహులు కాదని గల్లాకు ఇస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం అన్నారు. టీడీపీ, బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఈ చర్చలో వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం మొదట్లోనే భరత్ అనే నేను సినిమా గురించి చెప్పడం, అవిశ్వాస తీర్మానం ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదని మరో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడటం చూస్తుంటే అవిశ్వాసం తీర్మానంపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోందని అన్నారు. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ మొదటి నుండీ ప్రత్యేక హోదా, విభజన హామీలపై బలమైన పోరాటం చేసి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుండి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీయేనని అన్నారు. కాకినాడలో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చింది తమ అధినేత పవన్‌కళ్యాణ్ అని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాయింట్ ఫ్యాక్టు ఫైండింగ్ కమిటీ వేసి 74వేల కోట్లు రావాలని లెక్కలు తేలిస్తే ఏ పార్టీ దాని గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాతోనే అభివృద్ధి సాధ్యమని, హోదా పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఆర్టికల్ 4లో కూడా హోదా ఇవ్వాలని ఉందని అన్నారు. అధికారంలోకి రాగానే ఐదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు వెంకయ్యనాయుడు కూడా చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో రాష్ట్రానికి హోదా, విభజన హామీలు అమలుపై బలంగా చెప్పలేదని తప్పుపట్టారు. ప్రసంగం మొదట్లో మోదీని విమర్శించి, అంతా అయ్యాక మోదీని కౌగిలించుకోవడం చూస్తే అదో నాటకంలా అనిపించిందని అన్నారు. వీరెవరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల పట్ల, సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, పార్టీ స్పీకర్ ప్యానల్ సభ్యులు అద్దేపల్లి శ్రీ్ధర్ పాల్గొన్నారు.