రాష్ట్రీయం

పార్లమెంటు అవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. సిబిఐ కేసు ఉందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు బయపడుతున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటువంటిది ఏమీ లేదనుకంటే పోరాటం చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ కేంద్రంపై వత్తిడి తెస్తూనే ఉన్నదని అన్నారు. ఇందులో భాగంగానే త్వరలో పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తామని ఆయన తెలిపారు.