రాష్ట్రీయం

అంతటా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 20: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాష్టమ్రంతటా ఉత్కంఠ నెలకొంది. విభజన అంశాల అమలులో కేంద్ర తీరుకు నిరసనగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎంపీల ప్రసంగాలు.. రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తదితర అంశాలపై కేంద్రం నుంచి స్పష్టత వస్తుందనే భావన ప్రజల్లో నెలకొంది. గత సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా డిమాండ్‌చేస్తూ అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆందోళన నిర్వహించిన సంగతి విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించింది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఉద్యమిస్తున్నది తమ పార్టీయే అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావించింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశానుసారం వైసీపీ ఎంపీలు రాజీనామా ఆమోదం కోసం పట్టుపట్టాయి. అయితే ఇది బీజేపీ కనుసన్నల్లో వైసీపీ ఆడుతున్న నాటకమని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలోనే ఉండి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాజా సమావేశాల్లో మరోవిడత అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తీసుకురావటం, స్పీకర్ చర్చకు అనుమతివ్వటంతో వైసీపీ ఇరకాటంలో పడ్డట్టయింది. పార్టీ ఎంపీలు లోక్‌సభలో లేకపోవటంతో రాజ్యసభ వేదికగా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజీనామాలతో తప్పు జరిగిందేమో అని వైసీపీ శ్రేణులు అంతర్మథనం చెందుతున్నారు. కాగా అధికార తెలుగుదేశం పార్టీ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో సచివాలయంలోని తన ఛాంబర్‌లో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో సమాలోచన జరపటంతో పాటు ఢిల్లీలోని పార్టీ ఎంపీలు, వారికి మార్గదర్శకాలు జారీ చేసేందుకు వెళ్లిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, కుటుంబరావుకు దిశానిర్దేశం చేస్తూ కేంద్రంతో పాటు వైసీపీని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహరచన చేశారు. తన ఛాంబర్‌తో పాటు సచివాలయంలో సందర్శకులు వీక్షించేందుకు శాసనసభ సమావేశాల లైవ్ స్క్రీన్లు ఏర్పాటు చేయించారు. ఎన్నికల ఏడాది ప్రజల్లో మైలేజీ సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. గతంలో ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తే రాజకీయపార్టీల మద్దతు కూడగడతానని ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బీజేపీ, టీడీపీల మధ్య మైత్రి కొనసాగుతోందని తాజాగా ఆరోపించటం గమనార్హం. ఉదయం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా విభజన సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్రవైఖరిని నిరసిస్తూ రాష్టవ్య్రాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్రం వాస్తవాలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కాగడాల ర్యాలీని నిర్వహించింది. కాగా సోమవారం రాజ్యసభలో తమ గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కన్నద్ధమవుతోంది. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చకు కేంద్రం దిగిరావటం తెలుగుదేశం పార్టీకి ప్లస్‌పాయింట్‌గా మారిందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీ సభ్యులులేకుండా విభజన అంశాల అమలు, కేంద్ర నిర్లక్ష్యాన్ని నిలదీయటం ద్వారా ఈ సమావేశాల్లో హైలైట్‌గా నిలిచామనే సంతృప్తి ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.