రాష్ట్రీయం

పురాతన బంగారు నాణేలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: తవ్వకాల్లో వెలుగుచూసిన పురాతన నాణేలు పంపకాలలో భేదాలు రావడంతో గుట్టురట్టై అధికారుల చెంతకు చేరిన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని సానికవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్డీఓ పెంచలకిశోర్ మాట్లాడుతూ సానికవరం గ్రామానికి చెందిన మొద్దుల సత్యనారాయణరెడ్డి తన పొలంలో పైపులైన్ల కోసం గుంతలు తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన ఓ చిన్నడబ్బా బయటపడింది. అందులో 30 బంగారు నాణేలు ఉన్నాయి. వీటిని పొలం యజమాని సొంతం చేసుకోగా కూలీపనికి వచ్చిన పొందుగుల నారాయణరెడ్డి తనకు వాటా ఇవ్వాల్సిందిగా కోరాడు. ముందుగా ఇరువురు 70, 30 శాతంగా పంచుకునేందుకు ఒప్పందం చేసుకొని 7 నాణేలను పెద్దదోర్నాల గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడి బంగారం దుకాణంలో నాణేల నాణ్యత, ఖరీదులను తెలుసుకున్నారు. ఒక్కో నాణెం విలువ 15వేల రూపాయలకు పైగా ఉందని తెలపడంతో ఆశపెరిగిన నారాయణరెడ్డి తనకు సగం ఇవ్వాలంటూ వివాదానికి దిగాడు. దీనితో వివాదం విషయం పోలీసులకు చేరింది. దీనితో పెద్దారవీడు తహశీల్దార్ దిలీప్, ఎస్సై పి ముక్కంటి గ్రామానికి వెళ్ళి విచారించి లభ్యమైన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ నాణేలు 15వ శతాబ్దానికి చెందినవని, ఒక్కొక్కటి 3.4గ్రాములు ఉన్నాయని, వాటిపై సీతారామలక్ష్మణులతోపాటు మరికొన్ని నాణేలపై బాలాజీ, లక్ష్మిదేవి బొమ్మలున్నాయి. వీటిని ఆర్కియాలజీ అధికారి శ్రీనివాస్ ప్రాథమిక పరిశీలన జరిపి విజయనగర రాజుల కాలంనాటి నాణేలని, వారి మూడవ వంశస్తులు వెంకటపతిరాజు హయాంలో తయారుచేసిన అత్యంత విలువైన చారిత్రక సంపదగా తేల్చారు.
ఈ విషయాన్ని ఆర్డీఓ పెంచలకిశోర్, డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు జిల్లాకలెక్టర్‌కు సమాచారం అందించి సంబంధిత నివేదికను అందచేశారు. ఈ నాణేలను పురావస్తుశాఖకు అందచేయనున్నట్లు ఆర్డీఓ పెంచలకిశోర్ తెలిపారు.