తెలంగాణ

లొంగిపోయిన రావెల సుశీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు స్కూల్ టీచర్‌పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్, అతని డ్రైవర్ రమేశ్ శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నిందితులు ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. ఆదివారం వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియాముందు ప్రవేశపెట్టారు. నిందితులను హయత్‌నగర్ మండలం తుర్కయాంజల్ మెజిస్ట్రేట్ తిరుపతయ్య ముందు హాజరుపర్చగా 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కాగా వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వర రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ స్కూల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా సుశీల్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
డిసిపి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ సుశీల్ అతని డ్రైవర్ రమేశ్ శనివారం అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో లొంగింపోయారని, ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలిని వెంబడించిన కారు మంత్రి రావెల కిషోర్ బాబుదేనని డిసిపి స్పష్టం చేశారు. కేసులో అన్ని అంశాలు పరిశీలించాకే సుశీల్‌పై నిర్భయ కేసు నమోదు చేశామన్నారు. రావెల సుశీల్, అతని డ్రైవర్ రమేశ్‌పై దర్యాప్తు పారదర్శకంగానే కొనసాగుతోందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని డిసిపి స్పష్టం చేవారు. కాగా సుశీల్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా విచారణ ఈనెల 8కి వాయిదాపడింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు
నేను ఎలాంటి తప్పు చేయలేదు. కావాలని నన్ను కేసులో ఇరికించారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమెను వెంబడించలేదు. కుక్కపిల్ల కారుకు అడ్డు రావడంతో కారు ఆపానని మంత్రి రావెల తనయుడు సుశీల్ పునరుద్ఘాటించారు. అయితే తనను వెంబడిస్తున్నాడంటూ ఆ మహిళ అకారణంగా తనపై అరుస్తూ తిట్టిందని దీంతో చుట్టుపక్కల వారు పోగయ్యారని, జరిగిన విషయం చెప్పేలోపే తనపై చేయి చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

చిత్రం... మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు పోలీసులు తీసుకొచ్చిన
రమేష్, రావెల సుశీల్