తెలంగాణ

భారీగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయితీలకు ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగానే పోలింగ్ శాతం నమోదైంది. ఖమ్మంలో 67.6, వరంగల్‌లో 60.3గా పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల పోలింగ్ శాతం కన్నా మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. తెరాస తొలిసారిగా ఖమ్మంలో గట్టి పోటీ ఇచ్చింది. వామపక్షాలు, కాంగ్రెస్, తెదేపాలు తెరాసను టార్గెట్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాయి. 22వ డివిజన్‌లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో, విపక్షాల నేతలు ఇది అధికారపక్షం అభ్యర్థి పనేనని ఆరోపించి రీ పోలింగ్ చేపట్టాలని ఆందోళనకు దిగారు. వరంగల్‌లో తెరాసకు అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థులే ఎంతోకొంత పోటీ ఇవ్వగా విపక్షాలు ఢీలాపడ్డాయి. ఖమ్మంలో మాత్రం విపక్షాలు తెరాసకు గట్టి పోటీనే ఇచ్చాయి. రెండు రోజుల క్రితం ఖమ్మంలో కాంగ్రెస్, తెదేపా, వైకాపా అభ్యర్థులు కొందరు తాము పోటీనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే పోలింగ్ రోజు మాత్రం తమకు ఓటువేయాలని కోరారు. వరంగల్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పది డివిజన్లలో తెరాస తిరుగుబాటు అభ్యర్థులు తెరాసకు గట్టి పోటీనిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయితీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో 71శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంతో విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాసను దీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్, తెదేపాలతో పాటు అన్ని పార్టీలు కలిసి ఐక్య కూటమి ఏర్పాటు చేసి పోటీ చేయడం విశేషం. నల్లమల అటవీ ప్రాంతంలోని నగర పంచాయితీ కావడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 20 వార్డులుండగా, తెరాస అభ్యర్థులకు ఐక్య కూటమి అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు.
chitram...
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి క్యూలో నిలబడిన మహిళలు