ఆంధ్రప్రదేశ్‌

హంస వాహనంపై కాళహస్తీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ ఆదివారం ఉదయం హంస, చిలుక వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందుచేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన నాగరాత్రి పురస్కరించుకొని ఉదయం గంగాదేవి సమేత సోమస్కందమూర్తి హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ చిలుక వాహనంపై ఊరేగారు. వేదపండితులు, మంగళవాయిద్యాలు, సాంస్కృతిక బృందాలు వెంటరాగా స్వామి, అమ్మవార్లు భక్తులను కటాక్షించారు.
రాత్రి శేష వాహనంపై స్వామివారు పురవిహారం చేశారు. అమ్మవారు యాళి వాహనంపై ఆశీనురాలై భక్తులను ఆశీర్వదించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
నేడు అందరికీ ఉచిత దర్శనం
మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. చలువ పందిళ్లు వేశారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేశారు. అదనంగా ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటుచేశారు.

శ్రీకాళహస్తిలో హంస, చిలుక వాహనాలపై ఊరేగుతున్న స్వామి, అమ్మవారు