ఆంధ్రప్రదేశ్‌

మంత్రి రావెలకు బాబు క్లాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఓటుకు నోటు కేసుతోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతమతమవుతుంటే, మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌పై హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేయడం తలనొప్పిగా మారింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రావెల కిశోర్‌ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కొంత చికాకు పడినట్లు తెలిసింది. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మనమే కాదు మన కుటుంబంలో ఉన్న సభ్యులూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇటువంటి విషయాలతో పార్టీకి, ప్రభుత్వానికి కూడా నష్టం కలుగుతుందని అన్నారు. ఇలాఉండగా పార్టీ నాయకులు కూడా మంత్రి కుమారుడు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కుక్క పిల్లను తప్పించబోయానంటూ బుకాయిస్తున్నారని విమర్శించారు. రావెల సుశీల్ కారులో ఆ అమ్మాయిని వెంబడిస్తున్నట్లు స్పష్టంగా ఉందని, ఇప్పుడు తెలంగాణ పోలీసులు సుశీల్‌పై నిర్భయ కేసు పెట్టడం, అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లే అయ్యిందని వారు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో పార్టీని పటిష్ఠం చేసుకోవాల్సిన సమయంలో స్వయాన మంత్రి కుమారుడు ఈ విధంగా ప్రవర్తించడం పార్టీకి నష్టం కలిగించేదని వారు విమర్శిస్తున్నారు.

నా కొడుకు అమాయకుడు!

కావాలనే కేసులో ఇరికించారు
రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర
సుశీల్ కేసులో జగన్ హస్తం
ఏపి మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపణ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6:వైకాపా తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే తన కొడుకు సుశీల్‌ను ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ కేసులో ఇరికించారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు.
ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నా కొడుకు అమాయకుడని, బంజారాహిల్స్ పోలీసులు మొదటి రోజు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సుశీల్ పేరు లేదని, మరునాడు కావాలని కొందరు వైకాపా నాయకులు ఎఫ్‌ఐఆర్‌లో సుశీల్ పేరు నమోదు చేయించారని ఆరోపించారు. అకారణంగా తన కొడుకు జీవితంతో ఆడుకుంటున్నారని, ఈ కేసు వెనుక వైకాపా అధినేత వైఎస్ జగన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తన కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదు..నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయంగా ఎదుర్కొనలేక కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా మంత్రులపై జగన్ కుతంత్రాలు పన్నుతున్నాడని, నాటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను మూసివేయించి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మింగేశారని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దళిత భూములు లాక్కున్న చరిత్ర వైఎస్‌ఆర్ కుటుంబానిదేనని, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి దళిత ద్రోహులని ఆయన మండి పడ్డారు. రాజధాని భూముల విషయంలో అయోమయంగా మాట్లాడుతున్న జగన్ ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడన్నారు. దమ్ముంటే బహిరంగ విచారణకు రావాలని ఆయన జగన్‌కు సవాల్ విసిరారు. మతిస్థిమితం కోల్పోయి పట్టిసీమను, ప్రాజెక్టులను అడ్డుకోవడం, సిఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం లాంటివి చేస్తున్నారని మంత్రి రావెల విమర్శించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే మంద కృష్ణమాదిగను ప్రోత్సహిస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆయ న ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు ఛీ..కొడతారన్న విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. రాష్ట్రం లో అభివృద్ధిని అడ్డుకుంటూ, కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ప్రజలు క్షమించరని, ప్రభుత్వాన్ని నిందిస్తే రాజకీయ పుట్టగతులుండవని మంత్రి రావెల హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయ కుతంత్రాలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన జగన్‌ను సూచించారు.