ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి 32 ప్రయోగానికి రేపు కౌంట్‌డౌన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టే స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం ఉదయం 10:30 గంటల నుండి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది. ఈ రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన 1425 కిలోల బరువు గల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం రాకెట్‌ను వ్యాబ్ నుండి రెండో ప్రయోగ వేదికకు తరలించారు. ఉదయం 6 గంటలకు షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ పచ్చజెండా ఊపి రాకెట్‌ను ప్రయోగ వేదికకు నెమ్మదిగా చేర్చారు. ఈ ప్రయోగం కోసం సోమవారం షార్‌లో చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఇస్రోలోని వివిధ విభాగాలను చెందిన శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇదేరోజు రాకెట్ ప్రయోగ రిహార్సల్ కూడా నిర్వహించనున్నారు. 8వ తేదీ ఉదయం 10:30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. వాతావరణం అనుకూలించి అన్నీ సజావుగా సాగిన అనంతరం పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ గురువారం సాయంత్రం సరిగ్గా 4 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది.

రాకెట్‌లోని రెండో దశను సిద్ధం చేస్తున్న దృశ్యం

ప.గో.లో ఫుడ్‌ఫ్యాట్స్ ఫ్యాక్టరీలో ప్రమాదం
కార్మికుడు మృతి
ప్రమాదకర స్థితిలో మరో ఇద్దరు
పెంటపాడు, మార్చి 6: పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఫుడ్‌ఫ్యాట్స్ ఫ్యాక్టరీలో శనివారం అర్ధరాత్రి సంభవించిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృత్యువాత పడ్డాడు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పెంటపాడు పోలీసుల కథనం ప్రకారం ఫ్యాక్టరీలోని బాయిలర్ నుండి కాలిన ఊక బూడిదను లాగుతుండగా, మంటలు వెలుపలికి వచ్చి ఆలేటి ఉప్పరయ్య (40), దెందుకూరి సతీష్ (31), యరమోటి పనసయ్య (41) అనే ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఉప్పరయ్య రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. పెంటపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.