తెలంగాణ

హైదరాబాద్ పాతబస్తీలో శివరాత్రినాడు విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైధరాబాద్: పాతబస్తీలో శివరాత్రినాడు విషాదం చోటుచేసుకుంది. బహాదూర్‌పురా పోలీస్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్‌లో గల అతి పురాతన దేవాలయంలో కాశీబుగ్గా శివాలయం ఒకటి. ఈ దేవాలయంలో శివరాత్రి వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి పెద్దఎత్తున ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో ఒకేసారి భక్తుల రద్దీ పెరిగింది. కాశిబుగ్గా దేవాలయంలో అకస్మాత్తుగా విద్యుత్ వైర్లు భక్తులపై పడ్డాయి. ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ భానోత్ శ్రీనివాస్ నాయక్(25) భక్తులను కాపాడబోయి కింద పడ్డాడు. దేవాలయం గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. గర్భగుడిలో కింద నీళ్లు ఉండటంతో ఆ నీళ్లలో విద్యుత్ వైర్లు ఉండటంతో షార్ట్‌సర్యుట్ కారణంగా కానిస్టేబుల్ విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు బహదూర్‌పురా ఇన్స్‌పెక్టర్ హరీష్‌కౌషిక్ తెలిపారు. కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల ప్రాంతంలో మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 2014 సంవత్సరంలో పోలీసు శాఖలో చేరిన శ్రీనివాస్ నాయక్ ఫలక్‌నూమ జంగమ్మెట్‌లోని రవీంద్ర నాయక్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు.