ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి 32 రిహార్సల్ నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థవన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుండి ఈ నెల 10న చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ప్రయోగ రిహార్సల్‌ను సోమవారం షార్‌లో విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లోని బ్రహ్మప్రకాష్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఇస్రోలోని వివిధ సెంటర్ల డైరక్టర్లు, శాస్తవ్రేత్తలు విచ్చేసి ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం రాత్రి 7గంటలకు షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉదయం మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్తవ్రేత్తలు రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను ప్రయోగ వేదిక నుండి ముందుకు తీసుకొచ్చి మళ్లీ వెనక్కి పంపే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వదేశీ నావిగేషన్ సేవలకు సంబంధించిన ప్రయోగానికి సన్నద్ధమైంది. 1425కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సి 32 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగ దృష్ట్యా షార్‌లో సందడి వాతావరణం నెలకొనింది. 54:30గంటలు కౌంట్‌డౌన్ పూర్తిచేసుకొన్నంతరం పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ 10న గురువారం సాయంత్రం 4గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి దూసుకెళ్లనుంది.