తెలంగాణ

గోపి, గాంధీ కారెక్కుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ టిడిపిలో మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారిలో కూడా ఇద్దరు చేజారిపోతున్నారా? అనే అనుమానాలు సొంత పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సభ సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ గైర్హాజరయ్యారు. దీంతో పార్టీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అయితే శివరాత్రి కావడంతో వారిరువురు సొంత నియోజకవర్గాల్లోని స్థానిక దేవాలయాల్లో బిజీగా ఉండడం వల్ల మాధవరెడ్డి వర్ధంతి సభకు హాజరుకాలేదని పార్టీ నేతలు చెప్పినా, కొంతమంది మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని గాంధీ ఇదివరకే ఖరాఖండిగా చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చంద్రబాబుకు మొదటినుంచి నమ్మిన బంటుగా ఉంటున్నారు. మాధవరెడ్డి వర్ధంతి సభ ముగిసిన తర్వాత చంద్రబాబు తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా సభలో ప్రతిపక్షాలతో కలిసి ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్న అంశాల గురించి ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేశారు.
మాధవరెడ్డి లేని లోటు పూడ్చలేనిది
అంతకుముందు చంద్రబాబు మాధవరెడ్డి వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన పరిపాలనా దక్షుడని, ఏ శాఖను అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని కార్యకర్తలను ఉద్ధేశించి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగారని కొనియాడారు.

సంగమేశ్వరంలో బోటు
బోల్తాపడి గర్భిణి మృతి
నందికొట్కూరు, మార్చి 7: మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. సప్తనదీ సంగమేశ్వరంలో సోమవారం బోటు బోల్తాపడి గర్భిణి మృతిచెందింది. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం సంగమేశ్వర ఆలయానికి చేరుకునేందుకు నందికొట్కూరు నుంచి ముచ్చుమర్రి మీదుగా బవనాసి వరకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. బవనాసి నుంచి సంగమేశ్వరానికి బోటులో ఐదు నిమిషాల ప్రయాణం. అయితే వేలసంఖ్యలో చేరుకున్న భక్తుల సరిపడా బోట్లు ఏర్పాటు చేయలేదు. కేవలం నాలుగు బోట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. పరిమితికి మించి భక్తులను ఎక్కించుకోవటంతో ఒక బోటు ఒడ్డునే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నెహ్రూనగర్ గ్రామానికి చెందిన భారతి (30) మృతిచెందింది.

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బందికి ఈ నెలవరకే వేతనాలు
నిలిచిపోయిన కేంద్ర నిధులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 7: జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) కింద పని చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపు జరగకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న సిబ్బందికి కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతున్నాయి. అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన నిధులు మార్చి వరకు మాత్రమే విడుదల చేయడంతో ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం సిబ్బందిని ఏప్రిల్ నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోయినప్పటికీ, ఏప్రిల్ వరకు వేచి చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రంలో జారీ అయిన ఉత్తర్వులు తమకు కూడా అందుతాయోమోనని రాష్ట్రంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద కాంట్రాక్టు విధానంతో 2008 నుంచి ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యునాని వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నియమించారు. అప్పటి నుంచి కాంట్రాక్టు విధానంపైనే సేవలు అందజేస్తున్న వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది వేతనాల కోసం కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతున్నాయి. ఈ నిధుల విడుదల నిలిచిపోవడంతో ఈ సిబ్బందిని సొంత నిధులతో కొనసాగించడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఉద్వాసన పలికింది. మరి ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేది ఇంకా వెల్లడికాలేదు.
అతీగతీలేని కెజి తరగతులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం తరగతులను మార్చి 21వ తేదీనే ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం నేటి వరకూ కిండర్‌గార్టెన్ క్లాసులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కె.జి నుంచి పిజి వరకూ ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉచిత విద్య దేవుడెరుగు, కనీసం కె.జి క్లాసులనే ప్రారంభించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుండే కెజి తరగతులు, సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కోరింది. నిర్లక్ష్యం చేస్తే 9వ తేదీ నుండి 16వరకూ విద్యాయాత్ర నిర్వహించక తప్పదని యుటిఎఫ్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి రవిలు పేర్కొన్నారు.
‘లెఫ్ట్’ను దెబ్బతీసేందుకు బిజెపి కుట్ర
సిపిఐ నేత సురవరం ధ్వజం
పార్టీ జాతీయ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 7: దేశవ్యాప్తంగా వామపక్షాలను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన పార్టీ జాతీయస్థాయి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డాక్టర్ కె నారాయణ, అమర్‌జిత్ కౌర్, వి రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ వామపక్షాలను దెబ్బ తీసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందన్నారు. యూనివర్సిటీలను కాషాయమయం చేయాలన్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనైనా మహిళా బిల్లును ఆమోదించేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానంలో కోరారు.