తెలంగాణ

కారెక్కనున్న మరో ఇద్దరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. 11వ తేదీన వీరి చేరికకు ముహూర్తం ఖరారైంది. అరికెపూడి గాంధీ చాలా రోజుల నుంచి టిఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మాత్రం తొలుత పార్టీ మారే ఆలోచన చేయకపోయినా గ్రేటర్ ఫలితాల తరువాత పునరాలోచనలో పడ్డారు. పార్టీ మారే ప్రసక్తి లేదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన వీరిద్దరూ వివిధ కారణాల మూలంగా తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. సాధారణ ఎన్నికల్లో టిడిపి తరఫున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడంతో ఇక టిడిపిలో మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. పది మంది ఎమ్మెల్యేలు ఇంతకు ముందే టిఆర్‌ఎస్‌లో చేరడమే కాకుండా టిడిపి శాసన సభాపక్షం సమావేశాన్ని నిర్వహించి టిడిపిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు తీర్మానం చేసి స్పీకర్‌కు అందజేశారు. ఈ పది మంది చేరిన తరువాత టిడిపిలో ఐదుగురు మిగిలితే, వారిలో ఇద్దరు 11న టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆర్ కృష్ణయ్య మొదటి నుంచి తనకు పార్టీతో సంబంధం లేదని, బిసిల కోసం ఉద్యమిస్తాను, ప్రోటోకాల్ కోసమే ఎమ్మెల్యేగా ఉంటున్నానని ప్రకటించి, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడిక టిడిపిలో మిగిలింది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, టిడిపి శాసన సభాపక్షం నాయకుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. వీరిలో సండ్ర వెంకటవీరయ్య కూడా టిఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడైన సండ్ర టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పుడు టిడిపిలో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారే. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్సీకి 50లక్షల రూపాయలు ఇస్తూ ఎసిబికి పట్టుపడిన రేవంత్‌రెడ్డి బెయిల్‌పై ఉన్నారు. ఇక సండ్ర వెంకటవీరయ్య సైతం ఈ కేసులో అరెస్టయ్యారు. 10 తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాక, సభ వాయిదా పడుతుంది. 11వ తేదీన సమావేశాలకు సెలవు. అదే రోజు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరుతారు. టిడిపి శాసన సభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనంపై స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.