రాష్ట్రీయం

అధికారంలోకి వస్తే అందరికీ ప్రభుత్వ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌతులపూడి: తాము అధికారంలోకి వస్తే పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చేస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం రౌతులపూడి మండలంలో కొనసాగింది. మండలంలోని పారుపాక డీజే పురం జంక్షన్ నుంచి ఉదయం 8.35 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన ఒక గంట మాత్రమే కొనసాగించారు. వడివడిగా డీజే పురం గ్రామానికి చేరుకున్న జగన్‌కు ప్రజలు తమ సమస్యలపై జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. తమ గ్రామానికి తాగు, సాగునీటికి ఎలాంటి సౌకర్యాలు లేవని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. టీడీపీ జెండా ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఇస్తామంటున్నారని, పార్టీలో లేనివారికి పించను గానీ, ఇల్లుగానీ ఇవ్వడంలేదని ప్రజలు మొర పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీలతో ప్రమేయం లేకుండా అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని జగన్ ఈసందర్భంగా వారికి హామీయిచ్చారు.
అనంతరం వడివడిగా తుని మండలం వెలమకొత్తూరు చేరుకున్న జగన్ 9.30 గంటలకు పాదయాత్రను ముగించారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. శుక్రవారం పాదయాత్రకు విరామం. తిరిగి శనివారం యాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో జగన్ వెంట ప్రత్తిపాడు వైసీపీ కన్వీనర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పాముల రాజేశ్వరీదేవి, అనంత ఉదయభాస్కర్, జి శ్రీను, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి