రాష్ట్రీయం

రాహుల్ పర్యటన షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారయింది. జాతీయ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా రాహుల్ నగరానికి వస్తుండటంతో పీసీసీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. 13న ఢిల్లీ నుంచి బీదర్‌కు అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. క్లాసిక్ గార్డెన్‌కు 3:30కు చేరుకొని 4:30 వరకు మహిళా సంఘాలతో భేటీ అవుతారు. 5:30 నుంచి 6:30 వరకు శేరిలింగంపల్లిలో ఏపీ, రాయలసీమ ప్రజలతో సమావేశం అవుతారు. అనంతరం హరితప్లాజాలో రాహుల్ బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9:00 గంటల నుంచి 31,666 మంది బూత్ కమిటీ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 10:30 నుంచి 11:30 వరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎడిటర్స్ మీట్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటల నుచి 1గంట వరకు తాజ్‌కృష్ణలో
యువ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. సమావేశాల మధ్యలో పీసీసీ ముఖ్యనేతలతో ఏకాంతంగా చర్చించే అవకాశం ఉంది.
సందిగ్ధంలో మైనారిటీ, ఓయూ సమావేశాలు
హాకిగ్రౌండ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ముస్లిం మైనారిటీ సమావేశానికి గ్రౌండ్ ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించడంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమావేశానికి వీసీ అనుమతి రాకపోకవడంతో రెండు సమావేశాలు సందిగ్దంలో పడ్డాయి. వాటిని మరోచోట నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. స్వల్పమార్పులతో రాహుల్ రాష్ట్ర పర్యటన సాగుతోందని చెప్పారు.