రాష్ట్రీయం

పది మీటర్ల పూతరేకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు రుచులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు కార్యక్రమాలను చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. వంటలపోటీలు, ఆహార పండుగలు, ప్రత్యేక రికార్డుల నమోదు ఇలా ఎన్నో అంశాల్లో పర్యాటక శాఖ తనదైన శైలిలో నిరంతరం కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పూతరేకు గొప్పదనాన్ని విశ్వ వ్యాప్తం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేపట్టిన పది మీటర్ల పూతరేకు తయారీ కార్యక్రమం విజయవంతమైంది. గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ప్రాధికార సంస్థ సీఈఓ హిమాన్షు శుక్లా ఈ నూతన రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల నుండి అందుకున్నారు. విజయవాడ బెరంపార్కులో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా ఆరుగంటల అనంతరం పది మీటర్ల పూతరేకు రూపుదిద్దుకుంది. ఇందుకోసం గోదావరి జిల్లాల నుండి తలపండిన పాక శాస్త్ర నిపుణులను ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ రప్పించింది. ఈ నేపథ్యంలో తయారుచేసిన పూతరేకును మీడియా సమక్షంలో కొలిపించగా అది పదిన్నర మీటర్లుగా నమోదైంది. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ రికార్డు పేరిట ఎటువంటి ఆధునిక పోకడలను అన్వయించ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఏ సీఎంఓ శ్రీనివాసరావు, పర్యాటక శాఖ ఓఎస్‌డీ లక్ష్మణమూర్తి, డైరెక్టర్ మురళికృష్ణ, హరినాథ్, విశ్వనాథం, బెరంపార్కు యూనిట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పూతరేకు తయారీ నేపథ్యంలో ఉదయం నుండి పర్యాటక అతిథిగృహం బెరం పార్కులో సందడి నెలకొంది. దీని తయారీలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన నలుగురు నిపుణులతో పాటు తిరుపతికి చెందిన ఓ గృహిణి పాల్గొన్నారు. తయారీ కోసం ఒక కిలో బియ్యం పిండి, కిలో జీడిపప్పు, కిలో పిస్తాపప్పు, కిలోన్నర పంచదార, కిలో బెల్లం, రెండు కిలోల నెయ్యి వినియోగించినట్టు ఎపీటఏ వంటకాల ఉప సంచాలకులు నిషార్ అహ్మద్ తెలిపారు.

చిత్రాలు..పది మీటర్ల పూతరేకు
*ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రం అందుకుంటున్న పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా