రాష్ట్రీయం

కమ్ముకొస్తున్న కరవు మేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 9: ఎండా కాలాన్ని తలపించే విధంగా వానా కాలం గడచిపోతుండటంతో పంటలన్ని ఎండిపోయి కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తొలకరిలో కురిసిన కాస్తన్ని వర్షాలకు ఉప్పొంగిన రైతులు ఖరీఫ్ పనులను సకాలంలో ప్రారంభించారు. ఆరుతడి పంటలు, చిరుధాన్యాలను సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మొలచిన మొలకలన్ని కల్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు నిస్సహాయులుగా చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, పెసర, మినుము తదితర పంటలు ఎండిపోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కుంభ వృష్టి కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్న వరుణుడు తెలంగాణ రాష్ట్రంపై అలకవహించాడు. ఎండిపోతున్న పంటలను రక్షించేందుకు అవసరమైన వర్షాలను కురిపించాలని అన్ని మతాలకు చెందిన రైతులు దేవుళ్లపై భారం వేసి పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. జూన్ రెండవ వారంతో ప్రారంభమైన వానా కాలంలో ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు కురిసిన దాఖలాలు మచ్చుకైనా లేవు. ఒక్క వాగు పొంగలేదు, చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరికి ఉప నది మంజీరపై నిర్మించిన సింగూర్, ఘన్‌పూర్ ప్రాజెక్టుల ఆయకట్టుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. సింగూర్ ప్రాజెక్టులోకి కనీసం రెండు టీఎంసీల నీరు కూడా వచ్చి చేరలేదు. ఇప్పటికీ డెడ్ స్టోరేజ్ స్థాయిలోనే ప్రాజెక్టులో నీటి మట్టం కొనసాగుతుంది. ఘన్‌పూర్ ఆయకట్టుదారులు ఇప్పటికే సింగూర్ నుండి నీటిని విడుదల చేయాలని ఆందోళన కార్యక్రమాలకు దిగిన విషయం తెలిసిందే. నల్లవాగు ప్రాజెక్టులో కూడా అంతంత మాత్రమే నీరు ఉండటంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. భూగర్భ జలమట్టం సైతం వందల అడుగుల లోతుకు పడిపోవడంతో అనేక బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఆయా బోర్ల క్రింద సాగు చేసిన వరి పొలాలు నెర్రెలు వాసి పంట ఎండిపోతుండటంతో రైతులు బిక్కమొహాలతో దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. సాగు నీరు విడుదల కాకపోవడంతో పుల్కల్, అందోల్ మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో వరి నాట్లు ప్రారంభం కాలేదు. పోసుకున్న నారు ముదిరిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సహాయానికి అదనంగా అప్పులు చేసిన రైతులు నట్టేట మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరువు జిల్లాగా ప్రకటించాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలో అధికారుల్లో వ్యక్తమవుతోంది.