రాష్ట్రీయం

విద్యతోనే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబ సభ్యుల ఒత్తిడిని కూడా అధిగమించి చదువును కొనసాగించాలని విద్యార్థులకు రాష్ట్ర ప్రథమ మహిళ, లేడీ గవర్నర్ విమలా నరసింహాన్ సూచించారు. గురువారం రాజ్‌భవన్‌లో లేడీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యార్థులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లేడీ గవర్నర్ మాట్లాడుతూ జీవితంలో స్వతంత్య్రంగా నిలదొక్కుకునేందుకు, ఆత్మగౌరవంతో ఎదిగేందుకు చదువే ప్రధానమని వివరించారు. ఆడబిడ్డలే దేశానికి ఆశా దీపాలని, వారి చదువు కుటుంబానికే గాక, సమాజానికి కూడా వెలుగునిస్తోందని మహాత్మగాంధీ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు భోధన అంశాలతో పాటు ఆరోగ్య సూత్రాలను కూడా బోధించాలని సూచించారు. కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె అభినందించారు. హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించి, ఐరన్ పోలిక్, విటమిన్ సి మాత్రలతో పాటు రాగిలడ్డూలను కూడి మూడు నెలల పాటు అందించేందుకు చొరవ తీసుకుంటున్న కలెక్టర్ యోగితారాణాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా పరిషత్, ప్రభుత్వ, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 6లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజిన్ కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని, రూ. వంద కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 26 వరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రాజ్‌భవన్‌లోని హై స్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కడియం పేర్కొన్నారు. బదిలీలతో ఈ పాఠశాలలో ఏర్పడిన ఉపాధ్యాయుల ఖాళీలన్నింటిని భర్తీ చేసినట్లు వెల్లడించారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు, 570 గురుకులాలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ప్రామాణిక ఉన్నత విద్యనందించేందుకు 53 మహిళా డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గురుకులాలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లలో మెనూను మొత్తం మార్చినట్లు వివరించారు. పోషకాహారాన్ని అందించేందుకు నెలకు ఆరు రోజుల పాటు నాన్‌వెజ్‌ను, ప్రతిరోజు మధ్యాహ్నా భోజనంలో 50గ్రాముల నెయ్యిని, వారానికి నాలుగు కోడి గుడ్లు విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమ, విద్యా సజావుగా సాగేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ జిల్లాలోని 182 ప్రభుత్వ ఉన్నత ప ఆఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 26వేల మంది బాలికలకు రక్తపరీక్షలు చేయించినట్లు తెలిపారు. వారిలో 5వేల మంది విద్యార్థినిలు ఎనిమిది శాతం లోపు హిమోగ్లోబిన్ కల్గి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారికి కావల్సిన ఐరన్ పోలిక్, విటమిన్-సి మాత్రలతో పాటు రోజుకు రెండు రాగి లడ్డూలను మూడు నెలల పాటు అందిస్తున్నట్లు తెలిపారు. బాలికల సంరక్షణలో భాగంగా 164 ఉన్నత పాఠశాలల్లో గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మిగిలిన 18 చోట్ల ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ విజయ్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి బీ. వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విద్యార్థులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను అందజేస్తున్న లేడీ గవర్నర్ విమలా నరసింహన్,
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ యోగితారాణా