రాష్ట్రీయం

అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: ప్రాణం ఉన్నంత వరకూ ముస్లింలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నానని, విజయవాడ, కడపల్లో హజ్ హౌస్‌లను నిర్మిస్తున్నామన్నారు. ముస్లింల అభ్యున్నతికి 1100 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు. మొదటి విడత హజ్ యాత్రకు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళుతున్న 200 మంది ముస్లింల వాహనాలకు ఉండవల్లిలోని గ్రీవెన్సుహాల్ వద్ద శుక్రవారం ముఖ్యమంత్రి జెండా ఊపి హజ్ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఐదు బస్సుల్లో సీఎం ఇంటి వద్దకు చేరుకున్న హజ్ యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు, హాజీలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘అల్లాను మీ రూపంలో చూడటం నాకు ఆనందంగా ఉంది’అని అన్నారు. ముస్లింల అభ్యున్నతికి ఈ బడ్జెట్‌లో 1100 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇమాంలకు, వౌజన్‌లకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. దీనికి బడ్జెట్‌లో 75 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. 8608 మందికి వేతనాలు చెల్లించడం ఒక చరిత్రగా అభివర్ణించారు. 225 షాదీఖానాలను 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, మరో 20 కోట్లతో మసీదులకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం దుల్హన్ కింద 50 వేల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ ముస్లింలకు అండగా ఉంటానన్నారు. 1.35 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద 285 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని, 1.41 లక్షల మందికి ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ను చెల్లిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద ముస్లింల నైపుణ్యాభివృద్ధికి 120 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హజ్ యాత్ర తానే ప్రారంభించానని, హైదరాబాద్‌లో హజ్ భవనం నిర్మించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడలో 80 కోట్ల రూపాయలతో, కడపలో మరో హజ్ హౌస్‌ను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రం బాగుండాలని అల్లాకు దువా చేయాలని ఆకాంక్షించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేయాలని కోరారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నామని, వారి అభ్యున్నతికి అన్ని విధాలా చర్యలు
తీసుకుంటామన్నారు. వక్ఫ్ భూములను కొందరు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకుని, ఆ భూములను కాపాడుతామని స్పష్టం చేశారు.
కిట్లు పంపిణి
హజ్ యాత్రికులకు దస్తులు, బ్యాగ్‌లను, కిట్లను సీఎం అందచేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి 2348 మందికి హజ్ యాత్రకు ఎంపిక కాగా, తొలి విడతగా 200 మంది వెళ్తున్నారు. అమరావతి నుంచి 77 ఏళ్ల సలీమ్ బి, అనంతపురం నుంచి రెండేళ్ల లుఖ్మన్ ఈ బృందంలో ఉండటం విశేషం. ఈ సందర్భంగా నారా హమారా - టీడీపీ హమారా అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర క్షేమం కోసం, ముస్లిం మైనారీటీల సంక్షేమం కోసం, పునాదుల నుంచి రాష్ట్ర నిర్మాణం కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్న సీఎం కలకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అక్కడికి వచ్చిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చిత్రం..హజ్ యాత్రికుల బస్సును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు