రాష్ట్రీయం

ఐటీ కేరాఫ్ విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నవ్యాంధ్రకు రానున్న ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయని, రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల్లో 60 శాతం విశాఖలోనే ఏర్పాటు కానున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ పరిశ్రమకు విశాఖ చిరునామాగా ఎదుగుతోందన్నారు.
ఐటీ రంగంలో 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే 36వేల ఐటీ ఉద్యోగాలు కల్పించామన్నారు. రుషికొండలో ఇప్పటికే పలు కంపెనీలు ప్రారంభమై పనిచేస్తున్నాయన్నారు. కాపులుప్పాడలో తొలి దశలో 100 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయని, మొత్తంగా నాలుగు దశల్లో 700 ఎకరాల్లో ఐటీ పార్కు విస్తరణ జరుగుతుందన్నారు. తొలి దశకు సంబంధించి రహదార్లు, విద్యుత్, ఇతర సదుపాయాల కల్పన పనులు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. కాపులుప్పాడ ఐటీ పార్కుల పూర్తయితే ఐదు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో
ముందుకు సాగుతోందన్నారు. చదువుకున్న యువతలో వృత్తి నైపుణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే 2020-24 నాటికి రాష్ట్రంలో నిరుద్యోగులే ఉండరని, అందరికీ ఉపాధి కల్పించేలా పరిశ్రమలు రానున్నాయన్నారు.
అంతకు ముందు రుషికొండ ఐటీ సెజ్‌ను మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సెజ్‌తో పాటు విశాఖ నగరంలో కొత్తగా ఏర్పాటైన 13 ఐటీ కంపెనీలతో పాటు విస్తరించిన నాలుగు ఐటీ కంపెనీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

చిత్రం..ఐటీ సమావేశంలో మంత్రి నారా లోకేష్