ఆంధ్రప్రదేశ్‌

పొదుపుతోనే మదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్ర పొదుపుమహిళలు ప్రపంచానికే ఆదర్శమని, డ్వాకా సంఘాల సభ్యులు కూడా త్వరలో చరిత్రను తిరగ రాయనున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం కర్నూలులోని ఎన్‌టిఆర్ అవుట్‌డోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు విద్యతో ఆడప్లిల్లకు ఆర్థిక భద్రత, సమాజంలో గౌరవం లభిస్తాయన్నారు. మహిళలు విద్య, ఉద్యోగ, ఉపాధిలో పురుషులతో సమానంగా రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆడపిల్ల ఇంటికి భారం అనుకుంటే రాబోయే రోజుల్లో జనాభా సమతుల్యత దెబ్బ తింటుందని హెచ్చరించారు. ఆడమగ అన్న తేడా లేకుండా ఇద్దరూ సమానమేనన్న భావన తల్లిదండ్రుల్లో రావాలన్నారు. చిన్న కుటుంబంతోనే ఎంతో లాభం ఉంటుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూనే వచ్చిందని, వారి అభ్యున్నతికి నాటి నుంచి నేటి వరకూ కృషి చేస్తూనే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడిపిల్లకు ఆస్తి హక్కు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. డ్వాక్రా సంఘాలకు వ్యాపారం కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఈ రుణాలను అభివృద్ది కోసం ఖర్చు చేయాలన్నారు. నిద్రలో కూడా తనకు పేద మహిళలు, డ్రాక్రా సంఘాలు గుర్తుకు వస్తాయన్నారు. రాష్ట్రంలో 85లక్షల మంది పొదుపుసభ్యులు ఉన్నారని, వీరిది ప్రపంచలోనే 14వ స్థానమని తెలిపారు. ప్రపంచానికే మన రాష్ట్ర మహిళా సంఘాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. పేద మహిళలందరికీ వంట గ్యాస్ పంపిణీ చేస్తామని, అలాగే గర్భిణులు,బాలింతలకు అంగన్‌వాడి సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మైక్రోఫైనాన్స్ ద్వారా రుణాలు ఇప్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఆడపిల్లల పట్ల వివక్ష తల్లినుంచే తొలగిపోవాలన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత చాలా కష్టాలో ఉన్నప్పటికీ అంగాన్‌వాడీల జీతాలు పెంచడం వల్ల రూ.312 కోట్ల భారం పడిందన్నారు. మహిళలకు స్థానిక సంస్థల తరహాలోనే చట్టసభల్లో కూడా 33శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేశామని సిఎం చెప్పారు. డ్వాక్రా సంఘాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా విక్రయించేందుకు అవకాశాలు వచ్చాయన్నారు. ఐటి రంగంలో సగం మంది ఆడపిల్లలు ఉద్యోగాలు సాధించడం అభివృద్ధికి సంకేతమన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో విమానాశ్రయం, అమరావతికి ఎక్స్‌ప్రెస్ రహదారి త్వరలో నిర్మిస్తామని, కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ది చేస్తామని తెలిపారు.

చిత్రం... కర్నూలులో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న సిఎం చంద్రబాబు