రాష్ట్రీయం

అడ్వకేట్ జనరల్‌గా శివానంద ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. ఇందు కు సంబంధించిన ఫైల్‌పై సీఎం కే. చంద్రశేఖర రావు శుక్రవారం ఉదయం సంతకం చేశారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్‌రావు శివానంద ప్రసాద్ నియామకానికి సంబంధించి జీవో 422ను విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కొత్త ఏజీ కృతజ్ఞతలు చెప్పగా, సీఎం ఆయనను అభినందించారు. శివానంద ప్రసాద్ స్వస్థలం జనగామ.
న్యాయవాద కుటుంబం
శివానంద ప్రసాద్ తండ్రి శ్రీహరి సబ్‌జడ్జిగా పనిచేశారు. పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం జనగామ జిల్లాలోని మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన వారు. ఉస్మానియాలో ఎంఏ, మహారాష్ట్ర నాందేడ్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1987లో న్యాయవాదిగా నమోదయ్యారు. ప్రముఖ న్యాయవాది త్రివిక్రమరావు వద్ద జూనియర్‌గా పనిచేశారు. ఈయన సతీమణి మాధవీ కూడా న్యాయవాది కావడం విశేషం. ఆయన ఇద్దరు కుమార్తెలు సైతం నేషనల్ లా కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. శివానంద ప్రసాద్
తొలి బీసీ అడ్వకేట్ జనరల్‌గా ఖ్యాతి గడించారు. అనేక బ్యాంకుల లీగల్ సెల్స్‌కు ప్యానల్ సభ్యుడిగా ఉన్న శివానంద ప్రసాద్ బ్యాంకింగ్ కేసులను వాదించడంలో దిట్టగా పేరు పొందారు.
ఈ ఏడాది మార్చి 6న అప్పటి అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పలు పిటీషన్లను పరిష్కరించడంలో ఒత్తిడి ఎదురవుతుండటం, మరో పక్క ఇటీవలె ఏజీ నియామకం జరపలేదని పేర్కొంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు కావడంతో ప్రభుత్వం ఈ నియమాకం చేపట్టినట్లు తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ-కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొడవ చేస్తూ, ప్రసంగం ప్రతులను చించి వేసి గవర్నర్‌పైకి విసిరారు. ఆ సమయంలో గవర్నర్ పక్కనే ఉన్న కౌన్సిల్ చైర్మన్ కే. స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో మర్నాడు అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే గవర్నర్ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేయడంతో పాటు మిగతా ఎమ్మెల్యేలను సమావేశాలూ ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డి అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు, అసెంబ్లీలో జరిగిన గొడవకు సంబంధించిన సీసీ పుటేజీలు ఇవ్వగలరా? అని అప్పటి ఎజీ ప్రకాశ్ రెడ్డిని ప్రశ్నించడంతో, అందుకు ఆయన సమ్మతించారు. ఎజీ కోర్టులో ఆ విధంగా హామీ ఇవ్వడం ప్రభుత్వానికి నచ్చలేదు. ప్రకాశ్ రెడ్డి పట్ల అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే అనారోగ్యం, వ్యక్తిగత కారణాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రెడ్డి అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

చిత్రం..ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్