రాష్ట్రీయం

ఏడేళ్లుగా ఏటికి ఎదురీదుతున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 10: లాలూచీ ఆలోచనలు లేకుండా... తెర వెనుక రాజకీయాలు చేయకుండా... రాష్ట్ర సమస్యలపై ఉద్యమిస్తుంటే తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబునాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు బహిరంగ లేఖ రాసారు. ఏడేళ్లుగా అలుపెరగకుండా.. భయపడకుండా... మడమ తిప్పకుండా ఏటికి ఎదురీదుతున్న రీతిలో దుష్ట రాజకీయలు చేస్తున్న వారిని ఎదురిస్తూ సత్యమేవ జయతే అని నమ్మి సాగుతున్నట్టు గుర్తు చేశారు. ఈడీ కేసులో నిందితురాలిగా వైఎస్ భారతి అనే వార్తలను కొన్ని పత్రికల్లో ప్రముఖంగా చూసి నిర్ఘాంత పోయినట్లు పేర్కొన్నారు. జడ్జి కేసును పరిగణనలోకి తీసుకోక ముందే కొన్ని పత్రికలను ముందే ఈ విషయం తెలిసిందన్నారు. నాడు వైఎస్‌ను, నేడు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. సీబీఐ విచారణలో పేర్కొనని కంపెనీలను, వ్యక్తుల్ని ఇనే్నళ్ల తరువాత ఛార్జిషీట్లలో ఎందుకు చేరుస్తున్నారు అని ప్రశ్నించారు. పగలు కాంగ్రెస్‌తో కాపురం..రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్న చంద్రబాబు నడుపుతున్న రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యాలతో సహా దొరికిపోయినా, సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసినా, దేశంలో నెంబర్ వన్ అవినీతి ప్రభుత్వం అని ఎన్ని సంస్థలు చెబుతున్నా బాబు మాత్రం రొమ్ము విరుచుకుని రాష్ట్రంలో తిరుగుతున్నారన్నారు. విచారణకు రావాల్సిన ఏ కేసులోనూ చంద్రబాబుపై విచారణ జరగటం లేదంటే వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. దీనిపై అందరూ ఆలోచించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.