రాష్ట్రీయం

కూలిపోతాయి... పట్టించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కూలిపోయే దశలో ఉన్న స్కూళ్లను పట్టించుకోవాలని, ఇప్పటికే పాడుబడిన స్కూళ్ల స్థానే కొత్త భవనాలు నిర్మించాలని కేంద్రం 36 రాష్ట్రాలను ఆదేశించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో 0.24 శాతం పాఠశాలలు పాడుబడ్డాయని, మరో 6.86 శాతం తరగతి గదులకు సంపూర్ణ మరమ్మతులు అవసరమని పేర్కొంది. తెలంగాణలో 0.17 శాతం స్కూలుభవనాలు పాడుబడ్డాయని, 6.44 శాతం తరగతి గదులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 0.67 శాతం స్కూలు భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయని, మరో 7.73 శాతం తరగతి గదులకు సంపూర్ణ మరమ్మతులు చేపట్టాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరం, అస్సాంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని వ్యాఖ్యానించింది. రానున్న కాలంలో భారీ ఎత్తున వర్షాలు కురిసే పరిస్థితిలో పాఠశాలల భద్రతకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇప్పటికే జాతీయ విపత్తు యాజమాన్య సంస్థ పాఠశాలల భద్రతకు మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని ప్రతి పాఠశాల అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు 2017 సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయని, ఈ మార్గదర్ళకాలను ఏ పాఠశాలలు అనుసరిస్తున్నాయో, ఏ స్కూళ్లు అనుసరించడం లేదో కూడా ప్రతి ఆరు నెలలకు సమీక్షించాల్సి ఉంటుందని సూచించింది. బాలల హక్కుల జాతీయ కమిషన్ సైతం పలు సూచనలను చేసిందని, వాటిని నిర్బంధంగా అనుసరించాలని రాష్ట్రాలను ఆదేశించింది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం ఈ డాటా లభ్యమైందని మానవ వనరుల మంత్రిత్వశాఖ పేర్కొంది. నిర్బంధ ఉచిత విద్యతో పాటు మంచి ప్రమాణాలున్న పాఠశాలలు సైతం విద్యా హక్కు చట్టంలో అంతర్భాగమని పేర్కొంది. అన్ని కాలాలకు భద్రతమైన భవనాల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉందని, అందుకు అవసరమేన మేరకు నిధులను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు అందజేస్తామని పేర్కొంది.