రాష్ట్రీయం

దుర్గగుడి ప్రక్షాళనపై బాబు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా ప్రాశస్త్యం పొందిన విజయవాడ దుర్గగుడి సన్నిధిలో జరుగుతున్న అపచారాలతో ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ముందుగా అన్ని విభాగాల్లోను ప్రక్షాళన చేసేందుకు నడుంకట్టారు. దుర్గమ్మకు ఓ భక్తురాలు సమర్పించిన విలువైన చీర చోరీకి గురికావడం... ఆ చీరను ట్రస్టుబోర్డు సభ్యురాలు కె.సూర్యలత కుమారి తనవెంట తీసుకెళ్ళినట్లు ఆధారాలు వెల్లడయినందున సీఎం జోక్యంతో ఆమెను ఏకంగా ట్రస్టుబోర్డు నుంచి తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి గత జూన్ మాసంలో రాష్ట్ర సర్వీస్‌కు డిప్యూటేషన్‌పై వచ్చిన ఆదాయపు పన్నుశాఖ అధికారిణి కోటేశ్వరమ్మను దుర్గ గుడి ఈఓగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా వ్యవహరించిన పద్మ ఇక బ్రాహ్మణ కార్పొరేషన్, దేవదాయశాఖలకు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవరించనున్నారు. ఇటీవల అర్ధరాత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలు కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇక పాలకవర్గ సభ్యులెవరూ ఆలయ దైనందిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని... నెలకొకసారి పాలకవర్గ సమావేశాలకు మాత్రమే హాజరుకావాలంటూ సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. బాబు ఆదేశాల మేరకు దుర్గగుడి వ్యవహారాల్లో మూడు దశాబ్దాలుగా అనుభవం కల్గిన ఆ ప్రాంతానికి చెందిన శాసనమండలి ప్రభుత్వ విప్, టీడీపీ అర్బన్ అధ్యక్షులు బుద్దా వెంకన్న శుక్రవారం దుర్గగుడికి చేరుకుని పలు వర్గాలతో సమాలోచనలు జరిపారు. అలాగే బోర్డు చైర్మన్ గౌరంగబాబు, పాలకవర్గ సభ్యులతో సమావేశమై చర్చించారు. ఇప్పటివరకు గుడిలో దైనందిన కార్యక్రమాల పర్యవేక్షణకు సభ్యులతో నడుస్తున్న కమిటీలన్నింటినీ రద్దు చేయించారు. అలాగే ఇక పాలకవర్గ సమావేశానికి ముందురోజు టీడీపీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశమై గుడి ప్రతిష్ఠ పెరిగేందుకు సలహాలు సూచనలు తీసుకోవాలంటూ వెంకన్న ఆదేశించారు. ఇకనుంచి వెంకన్న దుర్గగుడి వ్యవహారాల పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు.

చిత్రం..దుర్గగుడి కొత్త ఈఓ కోటేశ్వరమ్మ