రాష్ట్రీయం

ఉన్నత విద్యలో నూరు శాతం ఎఫ్‌డీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఉన్నత విద్యలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివిధ రాష్ట్రాల్లో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అలాగే స్థానిక సంప్రదాయ యూనివర్శిటీలు సైతం విదేశీ యూనివర్శిటీలతో కలిసి ఉమ్మడిగా పరిశోధనలకు, కోర్సుల నిర్వహణకు వీలుకలుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసినా, స్థానిక చట్టా లు, నిబంధనలతో వాటిని ఆయా సంస్థలు మూసివేశాయి. అయితే తాజాగా ఎఫ్‌డీఐ-2017 విధానంతో విదేశీ సంస్థలు 100 శాతం నిధులను ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే వివిధ రాష్ట్రాల్లో సరళతరం చేసిన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం యూజీసీ ప్రమోషన్ అండ్ మెంటైనెన్స్ ఆఫ్ స్టాం డర్డ్స్ ఆఫ్ అడమిక్ కొలేబరేషన్ నిబంధనలను తీసుకువచ్చింది. విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆయా దేశాల్లో అక్రిడిటేషన్ పొంది ఉంటే, అత్యున్నత విద్యాసంస్థలుగా గుర్తింపు పొంది ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు, అలాగే ఆయా దేశాల్లో ఆ విద్యాసంస్థల్లో కనీసం రెండు బ్యాచ్‌ల విద్యార్థులు తమ స్నాతకోత్తర చదువు పూర్తి చేసి ఉండాలి. ఈనేపథ్యంతో భారత్‌లో ఎక్కడైనా వృత్తిసాంకేతిక విద్యా సంస్థలను నెలకోల్పేందుకు వీలుం ది. అలాంటి సంస్థల ఏర్పాటు సందర్భంగా విద్యాత్మక సౌకర్యాలు, ల్యాబ్, లైబ్రరీ, వర్కుషాప్ సదుపాయం, ఇతర వౌలిక సదుపాయాలను కల్పించా ల్సి ఉంటుంది, దాంతో పాటు సమీపంలోని సంప్రదాయ వర్శిటీతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు యూజీసీ , ఏఐసీటీఈ కలిసి ఉమ్మడిగా మార్గదర్శకాలను రూపొందించాయి. ఈ సందర్భంగా ఏఐసీటీఈ కూడా సమగ్ర సూచనల దర్శిని విడుదల చేసింది. విద్యాసంస్థల ఏర్పాటుకు కావల్సిన భూమి, ఫిక్సిడ్ డిపాజిట్లు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, విశ్వవిద్యాలయాలతో అనుబంధ గుర్తింపు, స్వీయ ప్రకటిత సౌకర్యాల నివేదిక తదిత ర అంశాలపై సూచనల దర్శిని రూపొందించింది.