రాష్ట్రీయం

14 అర్ధరాత్రి నుంచి రైతు బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 10: తెలంగాణలో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహకాలు, పెట్టుబడులు, ప్రాధాన్యత మరే రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రొత్సహం వల్ల చదువుకున్న యువత కూడా నేడు వ్యవసాయం వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా ములుగు రోడ్డు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన యంత్రాల ప్రదర్శన, రైతుల ముఖాముఖి సమావేశంలో కడియం శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయంలో అధునిక యంత్రాలను తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని, భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలిపారు. అయితే ఈ అధునిక యంత్రాలను ఆయా కంపెనీలతో మాట్లాడి తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలల్లో ఎగ్జిబిషన్ పెట్టించాలని కోరారు. గ్రామీణ రైతాంగానికి కూడా యంత్రాల గురించి అవగాహన వస్తుందని చెప్పారు. అదే విధంగా రైతులు వినియోగిస్తున్న అధునిక యంత్రాల కంపెనీలు, వారి సర్వీస్ సెంటర్లను కనీసం జిల్లా కేంద్రాల్లోనైనా ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు వ్యవసాయంపై చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మలు చంపుకుని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఇది చూసి వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును అదుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ మెనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కడియం శ్రీహరిని పెట్టి రైతుల అప్పులను మాఫి చేశారని చెప్పారు. ఇందు కోసం దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు సగటున ఎంత అప్పు ఉందో ఈ కమిటీ అధ్యయనం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు సగటున 2లక్షల 25వేల రూపాయలు, ఛతీస్‌గడ్‌లో 18వేల రూపాయలు, మహారాష్టల్రో 1లక్షా 80వేలు, ఉత్తరప్రదేశ్‌లో 80వేల రూపాయలు, తెలంగాణలో 95వేల రూపాయలు ఉన్నాయని తెలిందని చెప్పారు. అందుకే మెనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు మాఫి చేయాలని నిర్ణయించారని అన్నారు. దిని కోసం రిజర్వుబ్యాంక్‌ను ఆశ్రయించామని తెలిపారు. రైతులకు అప్పులు మాఫి చేయడంలో సహకరించాలని కేంద్రాన్ని కోరితే స్పందించలేదని అన్నారు.

చిత్రం..నాటు వేసే యంత్రాన్ని నడుపుతున్న మంత్రి పోచారం, పక్కన కడియం శ్రీహరి