ఆంధ్రప్రదేశ్‌

అతివకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాభ్యున్నతికి, ఆరోగ్యానికి, ఆర్ధిక స్వావలంబనకు, వారిలో విశ్వాసాన్ని కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అనేక కొత్త పథకాలను, నిర్ణయాలను ప్రకటించారు. శాసనసభలో ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేశారు. సింగిల్ విండో పథకం ద్వారా 35 సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచిత సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు, ముఖ్యంగా మహిళలలో బ్రెస్టు, సర్వైకల్ క్యాన్సర్, జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులు, గర్భధారణ సంబంధమైన ఆరోగ్య సమస్యలపై దృష్టిసారించడం జరుగుతుందని సిఎం చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇంత వరకూ ఆరోగ్య సేవలు, కార్యక్రమాల పరిధిలోకి రాని మహిళలు అందర్నీ చేర్చుకునేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 223 ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణీలకు ఉచితంగా టెలిఆల్ట్రా, సోనోగ్రఫీ సేవలు అందిస్తామని, రాబోయే 60 రోజుల్లో కనీసం పది వంద పడకల సౌకర్యం ఉన్న తల్లి బిడ్డ ఆస్పత్రలను రాష్ట్రప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఒత్తిడి , వేధింపులకు గురైన మహిళలకు తక్షణ సాయం అందించడానికి 181 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాబోయే మూడేళ్లలో ప్రతి ఏటా 10వేల అంగన్‌వాడీ కంద్రాలు నిర్మాణం చేసేందుకు నిర్ణయించామని అన్నారు. ఉద్యోగం చేసే మహిళలు, బాలికలు కోసం ఉన్న అన్ని గృహాలను, హాస్టళ్లను తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసేలా చట్టం తీసుకువస్తామని అన్నారు. అన్ని స్థానిక సంస్థల్లో మహిళా సంక్షేమం, రక్షణకు తప్పనిసరి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో కన్యా శక్తి టీమ్‌లను ఏర్పాటు చేసి, ఆడపిల్లలు అందరూ శిక్షణ పొందేలా చేస్తామని అన్నారు. బాల్యవివాహాల వంటి ప్రమాదకర ధోరణులను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మున్సిపల్ వార్డుల్లో జరిగే ప్రతి వివాహం రిజిస్ట్రేషన్ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని సిఎం చెప్పారు. మహిళలు, ఆడపిల్లలపై జరిగే హింస, అసమానత్వం తొలగించేందుకు తగిన సమాన భాగస్వామ్యం కల్పించేందుకు జీవన ప్రమాణాలను పెంచేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. అభయం పేరిట యాప్ తెస్తామని, తద్వారా మహిళలకు నమ్మకం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఐజిని, జిల్లాల్లో ఒక డిఎస్పీని నియమించి ప్రత్యేక బృందాలను నియమిస్తామని సిఎం చెప్పారు.
మహిళలకు అవార్డులు
వచ్చే ఏడాదికి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూస్తామని, మహిళలను నృత్యంలో ప్రోత్సహించేందుకు కూచిపూడిలో నాట్యారామం ఏర్పాటుకు వంద కోట్లు కేటాయించామని, అలాగే రానున్న రోజుల్లో వివిధ రంగాలకు చెందిన మహిళలకు అవార్డులను ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో 200 మంది గైనకాలజిస్టులను నియమిస్తామని సిఎం వెల్లడించారు.