రాష్ట్రీయం

కాపులపై కేసులు మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, ఆగస్టు 11: తునిలో రైలు తగలబెట్టింది ముమ్మాటికీ చంద్రబాబేనని, ఆ సమయంలో కాపులపై పెట్టిన కేసులన్నీ తమ ప్రభుత్వం ఏర్పడగానే పూర్తిగా ఎత్తివేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 234వ రోజుకు చేరిన ఈ యాత్రకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కొత్తవెలమకొత్తూరు వద్ద అభిమానులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక గొల్లప్పారావు సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ వనరులు ఎన్ని ఉన్నా ఆర్థిక అసమానత వల్ల ఉపయోగం లేకుండా పోయాయన్నారు. చదువుకునే రోజుల నుండి చదువుకొనే రోజులు దాపురించాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి బినామీ కళాశాలలకు విద్యార్థులను మళ్లించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రైవేటు కళాశాలలను నియంత్రించి ఫీజులు తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యనభ్యసించడానికి ఎంత ఖర్చయినా భరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని తీర ప్రాంతం తొండంగిలో ఆక్వా హేచరీలు అధికంగా ఉన్నాయని, కానీ ఇక్కడ ఎస్‌ఈజెడ్ భూములను చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్‌కు అప్పగించి ఫార్మా కంపెనీ ఏర్పాట్లకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి పరిశ్రమల వల్ల ఆక్వా పరిశ్రమ కుదేలవుతుందని
జగన్ స్పష్టంచేశారు. పరిశ్రమలకు తాను వ్యతిరేకంకాదని, దివీస్ లాంటి పరిశ్రమలు సమీప జిల్లా విశాఖలో కూడా పరిశ్రమను నెలకొల్పవచ్చునన్నారు. మూడు నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలందించే ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత ఎక్కువగా ఉందని, 108కు డీజిల్ లేని పరిస్థితి నెలకొందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ట్రామా కేర్ సెంటర్‌కు అనుమతులిస్తే నేటి వరకూ అది పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా పదవులు నిర్వహించిన యనమల నేడు దోపిడీ పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడ అనుమతిలేని ఇసుక తవ్వకాలను వారి అనుచర్లచేత చేయించి యథేచ్ఛగా ఇసుక దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఎవరైనా ఎదురుతిరిగితే కేసులు పెడుతున్నారన్నారు. ఇక్కడ జరుగుతున్న పోలవరం పనుల అంచనా వ్యయం పెంచి వియ్యంకుడు పుట్టా సుధాకర్‌కు అప్పగించారని మంత్రి యనమలను విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పార్థసారధి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, సినీ నటుడు విజయచంద్ర, మోతుకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తుని బహిరంగ సభలో అభివాదం చేస్తున్న జగన్