రాష్ట్రీయం

పోలీస్ శాఖ ఉద్యోగాల రాత పరీక్షలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: పోలీస్ శాఖ నిర్వహించనున్న రాత పరీక్షలు వాయిదా వేశారు, సెప్టెంబర్ 2వ తేదీన పోలీస్ శాఖలో రెండు విభాగాలకు చెందిన పరీక్షలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే అదే రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 475 పోస్టులకు రాత పరీక్షలకు తేదీలను ప్రకటించింది. దీంతో ఇటు పోలీస్ శాఖ అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన రాత పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలకు హాజరు కాలేమని, ఏదోఒక పరీక్ష రాస్తే రెండవ పరీక్షకు అభ్యర్థులు అవకాశం కోల్పోవాల్సి వస్తుందని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వానికి విజప్తి చేశారు. అభ్యర్థుల వినతిని పరిశీలించిన పోలీస్ శాఖ సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టిన రాత పరీక్షలను సెప్టెంబర్ 9వ తేదీ ఆదివారం నాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా సీనియర్ పోలీస్ అధికారి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మండల ప్రణాళిక,గణాంకాల, అసిస్టెంట్ గణాంకాల ఉద్యోగాలు దాదాపు 474 పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. వీటి పరీక్షలు సెప్టెంబర్ 2వ తేదీన యథాతంగా నిర్వసించనున్నారు. పోలీస్ శాఖలో సమాచార, సాంకేతికతోపాటు కమ్యూనికేషన్‌లో 29 పోస్టులకు 13,944 మంది దరఖాస్తు చేసుకోగా, ఫింగర్ ప్రింట్ బ్యూరోలో 26 పోస్టులకు 7,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 1500 మంది అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెండు పరీక్షలకు 1500 మంది అభ్యర్థులు హాజరు కాలేరు కనుక పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రాత పరీక్షలు వాయిదా వేశారు.