రాష్ట్రీయం

పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 13: ఎడతెరిపి లేని వర్షాలకు తోడు ఉప నదుల నుండి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నది ఉపనదులు వరద పోటుకు గురయ్యాయి. దీంతో గోదావరి నది భారీగా వరద జలాలతో ఉరకలేస్తోంది. ప్రధానంగా ఉపనది శబరి పొంగుతోంది. దీనితో ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి వడివడిగా పెరుగుతోంది. సోమవారం ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద 8.50 అడుగుల ప్రవాహ మట్టం నమోదైంది. నదీ గర్భంలో 13.26 మీటర్ల లోతులో గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన వరద జలాలను వచ్చినట్టుగా సముద్రంలోకి విడిచి పెట్టారు. బ్యారేజి నుండి సోమవారం రాత్రి 5 లక్షల 88 వేల 816 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు.
కొట్టుకుపోయిన వంతెన చప్టా
విఆర్ పురం: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రపురం మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని కుంజవారిగూడెం, తెల్లవారిగూడెం, తుష్టివారిగూడెం, అన్నవరం, దారపల్లి వాగులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. జల్లివారిగూడెం వాగు పొంగి వంతెన చప్టా పైనుంచి ప్రవహించటంతో చప్టా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ చప్టాను ఇటీవలే రూ.35 లక్షల ఉపాధి హామీ నిధులతో ఐటిడీఏ అధికారుల పర్యవేక్షణలో ఓ కాంట్రాక్టరు నిర్మించారు. అయితే నాసి రకం మెటీరియల్‌తో చప్టాను నిర్మించటం వల్ల కొట్టుకు పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.