రాష్ట్రీయం

సుపరిపాలన కాంగ్రెస్‌కే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాల్‌కల్, జహీరాబాద్, ఆగస్టు 13: దేశప్రజలకు సుపరిపాలన అందించడం కాంగ్రెస్‌కే సాధ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కర్ణాటకకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు బీదర్‌లోని నెహ్రూ స్టేడియంలో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పాలించే దక్షత కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కర్ణాటకలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీచేసి ఆదుకున్నామన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి, విదేశాలనుంచి రప్పించి దేశంలోని ప్రతి ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రజలకు ప్రలోభ పెట్టారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించి దేశ ప్రజలను మోసంచేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగాయన్నారు. ప్రభుత్వానికి డీజిల్, పెట్రోల్‌పై నియంత్రణ లేదన్నారు. తమ ప్రభుత్వం వస్తే మంచి పాలన అందించి ప్రజలకు ధరాభారం పడకుండా చూస్తామన్నారు. నాయకులు రాహుల్‌ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.