తెలంగాణ

జడ్జీల నియామకంపై తొందరపడేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తి పదవుల భర్తీకి తాను తొందరపడేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీఎన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. న్యాయవాది ఎస్ రాజ్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రాధాకృష్ణన్, జస్టీస్ ఎస్వీభట్‌ల బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. న్యాయవాదుల స్థాయిత్వాన్ని అధ్యయనం చేయకుండా వారిని న్యాయమూర్తులుగా నియమించాలని కోరుకుంటున్నారా అంటూ పిటీషనర్‌ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని బెంచ్ పేర్కొంది. ఉమ్మడి హైకోర్టులో 61 మంది న్యాయమూర్తులు ఉండాలని, కాని ప్రస్తుతం 29 మంది మాత్రమే న్యాయమూర్తులున్నారని, 32 మంది న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పిటీషనర్ చెప్పారు.
సీఆర్‌డీఏపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఎ వ్యవహార సరళిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టీస్ ఎస్వీ భట్‌లతో కూడిన బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ వివరాలు ఇవ్వండి
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేయలేదని పేర్కొంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కేరోజా దాఖలు చేసిన పిటీషన్‌పై వివరణ ఇచ్చాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ హోం శాఖను ఆదేశించారు. కేసు తదుపరి విచారణను పది రోజులు వాయిదా వేశారు.
ఫారం 1 నోటీసులపై ఆదేశాలు నిలిపివేత
శాసనసభ నుండి బహిష్కృతులైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ ఎ సంపత్‌కుమార్‌ల కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులపై ఫారం-1 నమోదుపై జస్టీస్ బి శివ శంకరరావు ఆదేశాలు నిలిపివేశారు. సోమవారం నాడు ఈ అంశం హైకోర్టులో విచారణకు వచ్చినపుడు హైకోర్టు ఆదేశాలపై హైకోర్టు ధర్మాసనంలోనూ, సుప్రీంకోర్టులోనూ పిటీషన్లు దాఖలు చేశామని, ఈ దశలో ఫారం -1 నమోదు సరికాదని శాసనసభ కార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకట రమణ పేర్కొన్నారు. న్యాయశాఖ కార్యదర్శి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచందర్‌రావు హాజరై న్యాయశాఖ కార్యదర్శిపై ఎలాంటి ఆదేశాలను పిటీషనర్లు కోరలేదని పేర్కొన్నారు.