రాష్ట్రీయం

సిట్టింగులకే టిక్కెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వందకు వంద ఒకటి శాతం టీఆర్‌ఎస్‌దే అధికారం
* రాష్ట్ర కార్యవర్గం భేటీఅనంతరం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 13: వచ్చే నెల 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, తమ ప్రభుత్వ ప్రగతి నివేదికతో పాటు అభ్యర్థులను ప్రకటిస్తామని టీఆర్‌ఏస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటనలో పార్టీ సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఏస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది తప్ప ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్సే వందకు వంద ఒకటి శాతం తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఏస్ రాష్ట్ర కార్యవర్గం సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన, ప్రభుత్వ ప్రగతి నివేదికకు బహిరంగ సభ వివరాలను వెల్లడించడంతో పాటు హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని సీఎం స్పష్టం చేసారు. ప్రధాన మంత్రి మోదీ, బీజేపీతో కేసీఆర్‌కు లోపాయికారి సంబంధాలున్నాయని జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘ఈ కేసీఆర్ మగాడు.. ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకుంటే బాజాప్తా చెప్పే చేస్తాడు తప్ప లోపాయికారి వ్యవహారాలు ఉండవు’ అని తీవ్రంగా స్పందించారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో తమ ప్రభుత్వ ప్రగతి నివేదికతో పాటు వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. ఈ సభను శంషాబాద్‌కు సమీపంలోని కొంగర కలాన్‌లో కానీ, కుత్బుల్లాపూర్‌లో కానీ నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ రెండు చోట్ల సభ నిర్వహణకు 15 నుంచి 16 వందల ఎకరాల స్థలం ఉందని, ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుందదో పార్టీ నాయకులు పరిశీలించి ఖరారు చేస్తారన్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల నేతలను ఎవరిని ఆహ్వానించడం లేదని స్పష్టం చేసారు. పార్టీ ఇంచార్జీలు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇక నుంచి పర్యటించి అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తారని తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అసలు పరిణతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు పరిణతి లేదన్నదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరోసారి నిరూపించాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వమే ఇతర పక్షాలకు బలంగా మారిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 22 లక్షల ఇళ్లు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని రాహుల్ అవగాహన లేకుండా వ్యాఖ్యానించారన్నారు. తాము ఎక్కడైనా 22 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పినట్టు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోలేదని కూడా రాహుల్‌గాంధీ విమర్శించారని, ఇప్పటికే భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య లక్షదాకా చేరుకుందని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రకటించిందని సీఏం గుర్తు చేసారు. ఈ ఏడాది రెండు లక్షల 60 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పామని, వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పది వేల ఇళ్లు కూడా కట్టలేదని రాహుల్ విమర్శించారు, ‘ ఆయన చూస్తానంటే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెబుతా, ఒక్కచోటనే 15 వేల ఇళ్లు కడుతున్నాం, చూస్తారా?’ అని సీఎం సవాల్ చేసారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయాన్ని చిల్లర రాజకీయంగా చూడవద్దని, ఏ విషయంలోనూ తొందర పడేదిలేదని ఏది చేసినా నిర్మాణాత్మకంగా చేస్తానన్నారు. త్వరలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా ఈ విషయంలో భేటీ కాబోతున్నట్టు తెలిపారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ రెండూ అభివృద్ధిసాధించడంలో వైఫల్యం చెందాయని కేసీఆర్ విమర్శించారు.