రాష్ట్రీయం

పరిపూర్ణానందస్వామికి హైకోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ ప్రభుత్వం విధించిన హైదరాబాద్ నగర బహిష్కరణపై స్టే విధిస్తూ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, వీహెచ్‌పీ నేతలు స్వాగతం పలికారు. శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ నుండి యాదాద్రి వరకూ పాదయాత్రకు ప్రయత్నించిన పరిపూర్ణానందకు అనుమతి నిరాకరించడమే గాక, స్వామిని జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధం చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్ నగరం నుండి ఆరు నెలల పాటు బహిష్కరించారు. అనంతరం సైబరాబాద్ పోలీసులు సైతం ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణను సవాలు చేస్తూ పరిపూర్ణానంద స్వామి హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయనపై నగర బహిష్కరణ ఉత్తర్వులపై స్టే విధించింది.
నేతల హర్షం
పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు హర్షించదగిందని తాము స్వాగతిస్తున్నామని బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కేసీఆర్ ప్రభుత్వం సాగిస్తున్న అరాజక పాలనకు ఇదో హెచ్చరిక అని పేర్కొన్నారు. తాను చేసిందే చట్టమని, తాను చెప్పిందే రాజ్యాంగమని విర్రవీగుతూ కేసీఆర్ ఉన్నత న్యాయస్థానాల్లో వరుసగా దెబ్బలు తగులుతున్నప్పటికీ ఆయనలో మార్పు కనిపించడం లేదని అన్నారు. పరిపూర్ణానంద స్వామి ఏకపక్ష నగర బహిష్కరణ విధించడంపై నోరు మెదపని కాంగ్రెస్, టీడీపీ, తెరాస, వైకాపా, కమ్యూనిస్టు పార్టీలు కుహనా లౌకికవాద పార్టీలు ఎవరి పక్షం ఉంటారో తెలుసుకోవల్సినే సమయం ఆసన్నమైందని అన్నారు. మజ్లిస్ పార్టీని బుజ్జగిస్తూ హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు.