రాష్ట్రీయం

రాహుల్ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: రాహుల్ గాంధీ మాటలు విని మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెరాస రెండూ దొందూ దొందేనని , కేసీఆర్ మాటలకు, చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాహుల్ మాట్లాడుతున్న విధానం అపరిపక్వత , నిరాశ, నిస్పృహలతో కూడుకున్నట్టుందని అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోదీకి బురద అంటించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని అన్నారు. మోదీ పాలనలో చిన్నపాటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సహించలేకపోతోందని అన్నారు. పదేపదే రాహుల్ గాంధీ రాఫెల్ గురించి మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రాహుల్‌గాంధీ మాట్లాడినపుడు రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ వాటి వివరాలను చెప్పారని, వాస్తవాలను పక్కదారి పట్టించి బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను రాహుల్ చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిందని, రాహుల్ గాంధీ నాయకత్వం చేపట్టాక రెండు రాష్ట్రాలకే ఆ పార్టీ పరిమితం అయిందని అన్నారు. అస్సాం ఎన్‌ఆర్సీపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో చెప్పలేకపోతోందని అన్నారు. అస్సాంలో ఒక రకంగా, బెంగాల్‌లో మరో రకంగా హైదరాబాద్‌లో ఇంకోరకంగా ద్వంద్వ ప్రమాణాలను అవలంభిస్తోందని అన్నారు. త్రిపుల్ తలాక్ విషయంలో నిఖా హలాల విషయంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయంపై రాహుల్ గాంధీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేయడం పరిపాటిగా మారిందని, ఢిల్లీలో ఉన్నపుడు కేంద్రానికి కితాబు ఇవ్వడం, హైదరాబాద్ వచ్చాక విమర్శలు చేయడం అలవాటుగా మారిందని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నది వారసత్వరాజకీయాలకు కాదని అన్నారు. మాట తప్పిన రాష్ట్రప్రభుత్వం తీరుపై బీజేపీ పల్లెపల్లెకూ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుండి 26 వరకూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నాయి బ్రాహ్మణుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సూర్యపల్లి శ్రీనివాస్‌తో పాటు పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు బీజేపీలో చేరారు. ఈ సమావేశంలో చింతల రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, మీడియా కన్వీనర్ వీ సుధాకర్ శర్మ, కార్యాలయ ఇన్‌చార్జి దాసరి మల్లేశం, నాయి బ్రాహ్మణ పోరాట సమితి అధ్యక్షుడు సూర్యపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన నగర బాట కార్యక్రమంలోనూ లక్ష్మణ్ ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.