రాష్ట్రీయం

వెలుగు తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 14: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలచేశారు. మంగళవారం భీమవరంలో ‘ఆంధ్రప్రదేశ్ జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్’ పేరిట దీన్ని విడుదల చేశారు. మొత్తం 12 అంశాలను ఇందులో పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఇది కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న కొన్ని హామీల్లో మచ్చుతునకలుగా 12 వాగ్దానాలను ప్రకటించారు. అలాగే తమవి సాహసోపేత నిర్ణయాలని తెలుసునని, అయితే ‘మనసుంటే మార్గముంటుందని’ అని బలంగా విశ్వసిస్తున్నానని, ఈ చిరుదీపం కోట్లాది మందికి వెలుగులిస్తుందని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఆగస్టు 14, 15,16 తేదీల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశముందని ఇప్పటికే ప్రకటించారు. బహిరంగ సభల్లోని తన ప్రసంగాల్లో మేనిఫెస్టోలో పొందుపరచనున్న అంశాలను సైతం బహిర్గతం చేస్తూ వచ్చారు.

మేనిఫెస్టోలో అంశాలు ఇవీ..
మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు
గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2500-రూ.3500 వరకు నగదు
బీసీలకు అవకాశాన్ని బట్టి 5 శాతం వరకు రిజర్వేషన్లు పెంపుదల
చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

అలాగే జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలను సైతం ఈ విజన్ డాక్యుమెంటులో పేర్కొన్నారు. కులాలను కలిపివే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన సిద్ధాంతాలుగా పేర్కొన్నారు.
ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో చూసినా కొన్ని వ్యాఖ్యల సమ్మేళనంలా ఉంటోందని, రాజకీయ విలువలు ఈ రోజుల్లో ఏ విధంగా దిగజారిపోయాయంటే ఒక రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను ఎన్నికలు తర్వాత కనీసం మాట మాత్రానికైనా గుర్తుకు తెచ్చుకోవడంలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గద్దెనెక్కే సమయంలో చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారని కాని ఆచరణలో చట్టాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. భూసేకరణ చట్టం-2013ను తెలుగుదేశం ప్రభుత్వం నీరుగార్చిందని, రైతులను భూమిలేని వారిగా చేసిందని విమర్శించారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానంచేసి, ఆ తర్వాత వెన్నుపోటు పొడిచిందని, ఇది ఏ రకం రాజ్యాంగ స్ఫూర్తిఅని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించాలని, వారికి మంచి ప్రమాణాలతో కూడిన జీవనాన్ని అందించాలని, తాగడానికి పరిశుద్ధమైన నీరు, కలుషితం కాని గాలి, ఆరోగ్యకరమైన పరిసరాలు ప్రతీ ఒక్కరికీ దక్కేలా జనసేన పాటుపడుతోందని వెల్లడించారు. ప్రజలందరికీ ముఖ్యంగా ఆడపడుచులకు పూర్తి భద్రతతో కూడిన పౌరసమాజాన్ని నిర్మించాలనేది జనసేన దృఢసంకల్పని పేర్కొన్నారు. మానవాళి నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా వారి జీవితాల్లో వసంతం తీసుకురావడమే మా లక్ష్యమని, ఈ దిశలోనే జనసేన మేనిఫేస్టో ఉండబోతోందని, సార్వజనీనకంగా ఉండే మేనిఫెస్టో సంపూర్ణ ప్రతిని త్వరలోనే విడుదల చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంతకు ముందు భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ అమ్మవారిని, పంచరామ క్షేత్రల్లో ఒకటైన సోమేశ్వరస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల పాదాల చెంత మేనిఫెస్టో కాపీలను ఉంచారు. అనంతరం వాటిని మీడియాకు విడుదలచేశారు.