రాష్ట్రీయం

గ్రామాల్లో పబ్లిక్ రేడియోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 14:గ్రామాల్లో ప్రజల మధ్య నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రజల మధ్య ఒక పబ్లిక్ రేడియో ఏర్పాటు చేయటానికి అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో ఆర్టీజీఎస్, ఈ-ప్రగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయినా ప్రజల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేసేలా ప్రత్యేకంగా పబ్లిక్ రేడియో ఏర్పాటుకు వీలుందేమో పరిశీలించాలని సూచించారు. దీనివల్ల విపత్తులు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్రామస్థులకు సమాచార వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఈ-ప్రగతి పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తిచేయాలని సూచించారు. డేటాను సమర్థవంతంగా వనియోగించుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా కలిగి ఉన్నవారే
సంపన్నులని, ఇది ఓ పెద్ద సంపద అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్ నాలెడ్జి ఎకానమీదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తలచుకుంటే డాటా వినియోగంతో అనూహ్య ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రజలకు రియల్ టైమ్‌లో మరిన్ని వివరాలు తెలిసేలా సీఎం డ్యాష్‌బోర్డును ఆధునీకరించాలన్నారు. దేశంలోని పది అత్యుత్తమ నివాసయోగ్య నగరాల్లో రాష్ట్రానికి చెందిన తిరుపతి, విజయవాడ నగరాలు గుర్తింపు పొందటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం కూడా ఈ జాబితాలో స్థానం పొందాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో అవకాశం కోల్పోయిందన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను ముందువరుసలో నిలిపేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. ఇందుకోసం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. సాంకేతికతతో ఆయా ప్రాంతాల్లో వాయు, ధ్వని కాలుష్యాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుసుకునే వీలుకలుగుతుందని చెప్పారు. వీధిదీపాలు మొదలు పారిశుద్ధ్య పరిస్థితి వరకు సమర్థవంతంగా పర్యవేక్షించగలమన్నారు. సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. దీన్ని సాధించటంలో సంతోష సూచీలో ముందుకు తీసుకెళ్లడం కూడా ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రహదారులపై ఉన్న గుంతలను గుర్తించేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. మొత్తం 70వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లోని రహదార్లను డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫ్రీ వైఫై పాయింట్ల ఏర్పాటు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 4వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 27వేల 93 ఉచిత వైఫై పాయింట్లను గుర్తించామన్నారు. వర్చువల్ తరగతి గదుల ఏర్పాటు సెప్టెంబర్ నెలకల్లా పూర్తిచేస్తామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాల మేరకు ఫైబర్‌నెట్ పనులు పూర్తిచేయాలన్నారు. కంటెంట్ కార్పొరేషన్ పనులు కూడా వేగవంతం చేయాలని సూచించారు.