రాష్ట్రీయం

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, ఆగస్టు 14: ర్యాగింగ్ మరో విద్యార్థినిని బలిగొంది. అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రియాంక(20) సీనియర్ల ర్యాగింగ్‌ను భరింలేక సోమవారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసు కుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామానికి చెందిన నాగేశ్వరనాయక్,
లక్ష్మీదేవి దంపతుల కూతురు ప్రియాంక చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో చేరినప్పుడే సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ఆ విషయాన్ని ప్రియాంక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది. దీంతో అప్పుడే వారు విషయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఏడాది కూడా అదే సంఘటన పునరావృతం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రియాంక రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ను భరించలేక ఎవరికీ చెప్పుకోలేక మనోవేదనకు గురై సోమవారం అర్థరాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్నం ఎస్‌ఐ గోపీ తెలిపారు.