రాష్ట్రీయం

తిరుమలలో ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 14: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుండి 9గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగి రాత్రి 7 నుండి 10గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితో పాటు ఉప ఆలయాలైన శ్రీ గరుడాళ్వార్, పోటు తాయార్లు, శ్రీవరదరాజస్వామి, శ్రీయోగ నరసింహస్వామి, శ్రీవిష్వక్సేన, శ్రీ భాష్యకార్లు, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబందన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద చుట్టుపక్కల ఎనిమిది దిక్కుల్లో సమర్పించారు. కాగా శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆనందనిలయ విమానం, ధ్వజస్థంభం శుద్ధి పనులను మంగళవారం టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధ్వజస్థంభ శిఖరానికి అలంకరించేందుకు 1.5లక్షల రూపాయల విలువైన 11నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్థంభానికి మధ్య ఉంచేందుకు 4లక్షల రూపాయల విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వరాస్వామిని అలంకరించేందుకు 1.75లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని టీటీడీ సిద్ధం చేసింది. వీటి ఏర్పాటు పనులను ఈవో, జేఈవోలు పరిశీలించారు.

నేడు మహాశాంతి పూర్ణాహుతి
అష్టబందన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా ఆగస్టు 15బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్ధశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3నుండి రాత్రి 7గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, ఆ తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఓ ఎస్ డీ పాల శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, బొక్కసం సూపరింటెండెంట్ గురురాజారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.