రాష్ట్రీయం

మా ఆదేశాలే అమలు చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: హైకోర్టు పదేపదే ఆదేశిస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదంటూ తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు హైకోర్టు మంగళవారం స్పీకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ కోర్టు ఆదేశించింది. దీంతో ఇన్నాళ్ళు కోర్టు, అసెంబ్లీ మధ్య నడుస్తున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. ‘కోర్టు ఉత్తర్వులు ఎవరు అమలు చేయకపోయినా శిక్షార్హులుగా ప్రకటిస్తాం’అని న్యాయమూర్తి హెచ్చరించారు. ఫారం 1లో చేర్చిన విధంగా అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలుకు నోచుకోకపోవడానికి కారణాలను చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలను పునరుద్ధరించాలని లోగడ తాము ఇచ్చిన ఆదేశాలు ఏమయ్యాయని న్యాయమూర్తి బీ శివశంకర్‌రావుప్రశ్నించారు. కోర్టు ఆదేశించినా అసెంబ్లీ అధికారులు తమ సభ్యత్వాలను పునరుద్ధరించడం లేదని,వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీ శివశంకర్‌రావుపిటిషన్లను విచారిస్తూ అసెంబ్లీ, లా సెక్రటరీల తీరుపై మండిపడ్డారు.
తమ ఆదేశాలను అమలు చేయకుండా ఎందుకు తప్పించుకుంటున్నరని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ సహా జిల్లా పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలకు ఎందుకు భద్రత కల్పించడం లేదని ప్రశ్నిస్తూ వారినీ ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 17వ తేదీలోగా సమాధానం చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి శివశంకర్‌రావు ఆదేశించారు.