రాష్ట్రీయం

ఈ ఏడాది మరో నాలుగు ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 15: నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట మండలం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) కేంద్రం ఈ ఏడాది మరో నాలుగు రాకెట్ ప్రయోగాలు చేయాలని నిర్ణయించామని షార్ డైరెక్టర్ ఎస్.పాండియన్ అన్నారు. బుధవారం ఆయన షార్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన కల్పన అంతరిక్ష భనవంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సూర్యునిపై అనేక పరిశోధనలు చేస్తున్నామన్నారు. పరిశోధనలన్నీ పూర్తయ్యాక ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది చివరిలోపు రెండు పీఎస్‌ఎల్‌వీలు, మార్క్- 3, జీఎస్‌ఎల్‌వీ-డి 2 ద్వారా జీశాట్-29 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపనున్నట్లు వెల్లడించారు. ఇందులో పీఎస్‌ఎల్‌వీ-సీ 42 ప్రయోగం సెప్టెంబరు రెండో వారంలో ఉంటుందన్నారు.
నవంబరులో సీ-43 ప్రయోగం ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. నావిక్ సేవలు (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)వినియోగంలోకి తెచ్చామన్నారు. తద్వారా ఒక మోబైల్ యాప్‌ను రూపొందించి తద్వారా సముద్రంలోకి వేటకెళ్లే జాలర్లకు రిసీవర్లు ఇచ్చి ప్రయోగాత్మకంగా చేశామన్నారు. ఆ యాప్ ద్వారా సముద్రంలో మత్స్యకారుల జాడ, ఎక్కడ చేపలు పడుతున్నారు తదితర వాటి జాడను కూడా సులువుగా తెలుసుకొన్నామన్నారు. ఇందుకు మత్య్సకారులు కూడా ఇస్రోకు అభినందనలు తెలపడమే కాకుండా ఆనందపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో నావిక్ సేవలు పూర్తిస్థాయిలో దేశానికి అందనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందన్నారు. ఇప్పటికే చంద్రయాన్-2 పై శాస్తవ్రేత్తలు పలు పరిశోధనలు చేశారన్నారు. ఈ ప్రయోగం మూడు ప్రయోగాలతో సమానమని అందువల్లే ఆలస్యం అవుతోందన్నారు. ఉపగ్రహాన్ని తీసుకుపోవడం, చంద్రమండలంలో కక్ష్యలోకి చేర్చడం, మళ్లీ రోవర్స్ ద్వారా దానిని కిందకు తీసుకురావడం అంటే ఈ ప్రయోగం మూడు ఉపగ్రహ ప్రయోగాలతో సమానమన్నారు.
ప్రతి సామాన్యుడికి ఫలాలు అందించే విధంగా ఇస్రో ప్రయోగాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ అవసరాల నిమిత్తం ప్రయోగాల సంఖ్య పెరిగాయని దానిని దృష్టిలో పెట్టుకొని శ్రీహరికోటలో ఘన ఇంధన కర్మాగారాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే రెండింతల అధికంగా తయారు చేసేందుకు సన్నాహం చేస్తున్నామన్నారు. మునుముందు సరికొత్త ప్రయోగాల కోసం షార్‌లో అధునాతన వసలతో కూడిన అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు. రెండో వాహన అనుసంధాన భవనం (ఎస్‌విఎబి) పనులు పూర్తయి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మునుముందు భారీ ప్రయోగాలకు షార్ వేదికకానుందని స్పష్టం చేశారు. డైరెక్టర్‌తోపాటు షార్ గ్రూపు డైరెక్టర్ గోపికృష్ణ, పబ్లికేషన్ అండ్ పబ్లిసిటి అధికారి విశ్వనాధ శర్మ, షార్ ఉద్యోగి అనిల్ ఉన్నారు.