రాష్ట్రీయం

గొప్ప థార్శనీకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, దార్శినీకుడని, మానవతావాది అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తన సంతాప సందేశంలో కొనియాడారు. భారతమాత ముద్దుబిడ్డ వాజపేయి లేని లోటు భారతదేశానికే కాకుండా మానవ సమాజానికే తీరని లోటు అన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయం, విలువలను కాపాడటంలో ముందుండే వారని గవర్నర్ అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజపేయి మృతి తీరని లోటని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని మాజీ ప్రధాని వాజపేయిని సీఎం కొనియాడారు. భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని శాసన మండలి చైర్మన్ కే. స్వామిగౌడ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. భావి తరాలకు ఆయనొక స్ఫూర్తి అన్నారు. నిజమైన రాజనీజ్ఞుడు మరణించారని ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేసారు. నాయకుడు అనే పదానికి నిజమైన నిర్వచనం వాజపేయి అన్నారు. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భవిష్యత్ తరాలు ఆయన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాయన్నారు. నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన సంతాప సందేశంలో మాజీ ప్రధాన వాజపేయి ఈ దేశానికి అందించిన సేవలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన సంతాప సందేశంలో ‘బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలనే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రిగా వాజపేయి ఎప్పటికి నిలిచిపోతారు’ అన్నారు. ఈ తరం రాజకీయాలకు ఆయనొక స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.

విలువలకు పాటుపడిన నేత: చాడ
దేశంలో ప్రజాస్వామ్య విలువల కోసం పాటుపడ్డ మహానేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించారని కొనియాడారు.