రాష్ట్రీయం

దేశ సేవే జీవిత ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 16: కఠినతరమైన సైనిక పోటీ పరీక్షలలో ముందుండి, లెఫ్టినెంట్‌గా ఎంపికై, 2018 మార్చి 10న కమిషన్‌డ్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, సాధారణంగా కనీసంగా రెండు ఏళ్ళలో పొందాల్సిన పదోన్నతిని కేవలం స్పల్ప సమయంలోనే పొంది రికార్డు సృష్టించాడు ధర్మపురి తేజం ఒజ్జల చిన్మయ్ దీప్ గోపాల కృష్ణమూర్తి శాస్ర్తీ. బాల్యం నుండీ చదువులో ముందుండి, చేసిన ప్రతి ఉద్యోగంలోనూ ప్రత్యేక గుర్తింపు నందిన ఒక యువకుడు, ఉన్నత ఉద్యోగాలు పొందీ, జీవితంలో స్థిర పడనున్నా, మాతృ భూమికి సేవచేయాలనే బలమైన చిరకాల వాంఛకు, ఎట్టకేలకు సాకారం కల్పించడంలో సఫలీకృతుడైనాడు. అల్లారు ముద్దుగా పెంచిన తనయుడు, తన లాగే ఉన్నతాశయాలతో ఉద్యోగాలలో రాణించాలనే తండ్రి కోరికను కాదని, తనది అందరిలాగే ఉద్యోగమే జీవితాశయం కాదని, తానూ అందరిలాగే ఉండకుండా, దేశానికి సేవ చేయాలన్నదే తన జీవిత ధ్యేయమని చెప్పి, తల్లిదండ్రులను మెప్పించి, ఒప్పించి, చివరకు ఆ యువకుడు అపురూప, అసమాన లక్ష్యాన్ని సాధించాడు. చేతి కందిన కొడుకు సైన్యంలో చేరతానని తెగేసి చెప్పి, లక్ష్య సాధనలో తనను ఆశీర్వదించాలని చేసిన విన్నపానికి తల్లిదండ్రులు తలొగ్గక తప్పలేదు. జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రమైన ధర్మపురికి చెందిన డాక్టర్ గోపాల కృష్ణమూర్తి ఒజ్జల శాస్ర్తీ (డాక్టర్ గోపాల్ కే.వి.శాస్ర్తీ) 25ఏళ్ళుగా టాటా కన్సల్టెన్సీ సర్సీస్‌లో పని చేసి, గోల్డ్‌మెడలిస్టుగా, ఎకనమిస్టుగా, లెక్చరర్‌గా, ట్రెయినర్‌గా, లీగల్ ఎడ్వైజర్‌గా, సోషల్ వర్కర్‌గా ముంబైలో పలు సంస్థల వ్యవస్థాపకులుగా, భారత రాష్టప్రతి, యూఎన్‌ఓ, యూఎస్ ప్రసిడెంట్, టాంజానియా, ఆస్ట్రేలియా, జపాన్, యూఏఇ కింగ్ తదితరుల ద్వారా పలు అవార్డులు పొంది లబ్దప్రతిష్ఠులైనారు. సామాజిక సేవలోనూ సాటిలేని మేటిగా నిలిచారు. తన లాగే తన ఏకైక కుమారుడు చిన్మయ్ గోపాల్ శాస్ర్తీ కూడా ఉత్తమ ప్రతిభుడై, రాణించాలని ఆకాంక్షించారు. తదనుగుణంగా చిన్మయ్ పదో తరగతిలో 90%కు పైగా మార్కులు సాధించాడు. బిఇ ఎలక్ట్రానిక్స్‌లో మహారాష్టల్రో ఎంఐటి పుణేలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. 24ఏళ్ళ చిన్మయ్, విప్రో కంపనీలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌గా 3ఏళ్ళు పని చేసి, టిసిఎస్, ఇంటెల్ (యూఎస్‌ఏ)కు ఎంపికై, పని చేసినా తన లక్ష్యం, గమ్యం అవి కావని, కంపనీలకోసం కాకుండా, దేశంకోసం పని చేయాలనే దృఢ సంకల్పంతో సైన్యంలో చేరడానికే కృతనిశ్చయుడైనాడు. తల్లిదండ్రులను ఒప్పించి, 2017 జనవరిలో జరిగిన పోటీ పరీక్షలలో లక్షమంది హాజరైనా, ఎంపికైన 400మందిలో తానూ ఒకడై పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని నిరూపించాడు. మొక్కవోని విశ్వాసంతో, చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్‌లో లెఫ్టినెంట్ అయిన ఒకే ఒకడుగా నిలిచాడు చిన్మయ్. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టతరమైన సైనిక శిక్షణా శిబిరాలలో భారతీయ శిక్షణా శిబిరం ఒకటి. ఏడాదిపాటు కొనసాగిన శిక్షణలో కేవలం 7గురు మాత్రమే సీక్యూఎంఎస్ (కంపనీ క్వార్టర్ మాస్టర్ సర్జంట్)కు ఎంపిక కాగా, చిన్మయ్ ఎంపికై సత్తా చాటాడు... జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చిన్మయ్, తన తండ్రి వృత్త్ధిర్మం దృష్ట్యా ముంబాయికి వెళ్ళి, అక్కడే చదువుకున్నా, ధర్మపురితో సంబంధ, బాంధవ్యాలను వీడలేదు. జగిత్యాల ప్రాంతం నుండి ప్రప్రథమంగా, చిన్మయ్ సైనికాధికారిగా ఎంపికై, జమ్ము కాశ్మీర్‌లో సైనికాధికారిగా విధులలో చేరాడు. అయితే అనూహ్యంగా అత్యల్ప కాలంలోనే అరుదైన పదోన్నతి పొంది, జమ్ము-కాశ్మీర్ ఆపరేషన్స్ ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ కేప్టెన్‌గా పదోన్నతి పొందాడు. సైన్యంలో చేరడమంటే ఎంత కఠినమో తెలిసిందే, ‘‘మొదట్లో ఆర్మీ మనకు తగదన్నాము, చిన్మయ్ మమ్మల్ని ఒప్పించి, విజయం సాధించి, తానేమిటో నిరూపించాక, మేమెంతో గర్వపడుతున్నాం, జమ్ము-కాశ్మీర్ ప్రపంచంలో అత్యధిక యుద్ధ్భూమి సహిత భయ భీతి కలిగించే ప్రాంతమైనందున అందరి దీవనలు మాకుమారునికి ఉండాలని కోరుతున్నాను అంటున్నారు తండ్రి విద్యాధికుడైన గోపాల్ శాస్ర్తీ’’.