రాష్ట్రీయం

శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో పనె్నండేళ్లకు ఒకసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసిందని, టీటీడీ విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకుని సహకరించిన భక్తులందరికీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ధన్యవాదాలు తెలిపారు. మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నిష్ణాతులైన రుత్వికులతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. టీటీడీ నిర్ణయించిన సమయాల్లో యాగశాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఎంతో క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఆగమ సలహా మండలి సూచనల మేరకు పెద్దజీయంగార్, చిన్నజీయంగార్‌ల సమక్షంలో ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 44మంది రుత్వికులు, 100మంది వేదపండితులు పాల్గొన్నారన్నారు. ఆగస్టు 11 నుండి 15వతేదీ సాయంత్రం వరకు 1.35లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆగస్టు 17వతేదీ నుండి యధావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చునని వివరించారు.
తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ గురువారం ఉదయం 10.30 గంటలలకు అర్చకులు ఖాద్రి నరసింహాచార్యులు చేతుల మీదుగా ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగిందన్నారు. యాగశాల కార్యక్రమాల అనంతరం శ్రీ్భగశ్రీనివాసమూర్తి, శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తితో పాటు ఇతర దేవతామూర్తులను తిరిగి పూర్వస్థానాల్లోకి వేంచేపు చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం 11గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విజయవంతంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులకు, అధికారులకు, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ చివరిరోజు కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాల్లో పూర్ణాహుతి నిర్వహించామన్నారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించామన్నారు. కలశాల్లోని శక్తిని తిరిగి విగ్రహాల్లోకి ఆవాహన చేయడాన్ని కళావాహనం అంటారని తెలిపారు.
ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలు, విశేష నైవేద్యాలు సమర్పించిన అనంతరం అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసిందన్నారు. అనంతరం ఆలయ ప్రధానర్చకులతో పాటు రుత్వికులను ఆలయ ప్రదక్షిణగా అర్చక నిలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అర్చక బహుమానం సమర్పించారు. గరుడ పంచమిని పురస్కరించుకుని సాయంత్రం 5 నుండి 6.30గంటల వరకు విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 నుండి 11గంటల వరకు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు సుధా నారాయణమూర్తి, చల్లా రామచంద్రారెడ్డి, రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథం, ప్రత్యేక ఆహ్వానితులు అశోక్‌రెడ్డి, శ్రీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాత్, ఇతర ప్రధానార్చకులు, ఓఎస్‌డీ పాల శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా గంటా నాదం, డోలు, నాదస్వరం
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరిగిన మహాసంప్రోక్షణ సందర్భంగా బంగారువాకిలి చెంత నిర్వహించిన చల్లింపు, శుద్ది, నివేదన సమయాల్లో గంటానాదం, డోలు, నాదస్వరం విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయ.