రాష్ట్రీయం

సాధారణం కంటే అధిక వర్షపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. రుతుపవనాలకు తోడు బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తోడవడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సాధారణం కంటే 129 శాతం అధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతవరణశాఖ తెలిపింది. ఈనెల 11, 12తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడం, జయశంకర్-్భపాలపల్లి, అదిలాబాద్, కొమరంభీం -ఆసీఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నారు. అలాగే 16-17 తేదీల్లో అదిలాబాద్, కొమరంభీం- ఆసీఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జిగిత్యాల్, రాజన్న-సిరిసిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని పేర్కొన్నారు. ఆగస్టు 12న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 293.8మీల్లీ మీటర్లు, 17న అదిలాబాద్ జిల్లా ఇచ్చోడులో 237.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ హెచ్చరించింది.