రాష్ట్రీయం

శ్రీశైలానికి వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 18: కృష్ణా నది ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు రావడంతో శ్రీశైలం జలాశయం నుండి శనివారం నీటిని దిగువకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వ ర్‌రావు శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు డ్యామ్ వద్ద పూజలు చేసి నాలుగు గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగర్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మూడేళ్ళ నుండి వరుసగా గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నాగర్జునసాగర్ కూడా త్వరలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని రెండు తెలుగురాప్ట్రాల నీటి అవసరాలను తీర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం డ్యామ్‌లోని మరో మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి మొత్తం ఏడు గేట్ల ద్వారా 1,59,636 క్యూసెక్కుల నీటిని దిగువ నాగర్జున సాగర్‌కు వదులు తున్నారు. ఆరు గంటల సమాయానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 882 అడుగులుగా, గరిష్ట నీటి నిలువ 215.8 టీఎంసీలకుగాను 198.3623 టీఎంసీలుగా నమోదై ఉంది. రిజర్వాయర్‌కు నీటి ప్రవహం ఎగువ జూరాల గేట్ల ద్వారా 96,332 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 4వేల క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 1,85,220 క్యూసెక్కులు చొప్పున మొత్తం 3,24,552 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్టు కుడిగట్టు పవర్ హౌస్ 110 మెగావాట్లు 7 యూనిట్లు 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,879 క్యూసెక్కులు నీరు తెలంగాణ ప్రాంత భూగర్భ పవర్ హౌస్‌లో ఒక్కొకటి 150 మెగా వాట్లతో 6 యూనిట్లు 900 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిచేస్తూ, 42,378 క్యూసెక్కుల నీటిని దిగువన నాగర్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వయర్ నుండి కల్వకుర్తి లీఫ్ట్ ఇరిగేషన్ కాలువలకు 2,400 క్యూసెక్కులు, రాయల సీమలోని హంద్రీనీవా లీఫ్ట్‌కు 225 క్యూసెక్కులు, పొతిరెడ్డిపాడు రెగ్యులెటర్ ద్వారా 26వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా నాగార్జునసాగర్‌కు పవర్‌హౌస్, గేట్ల ద్వారా 2,32,893 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత 24 గంటలలో శ్రీశైలం డ్యాము కుడిగట్టు పవర్ హౌజ్ ద్వారా 17.862 మిలియన్ యూనిట్లు, భూగర్బ పవర్‌హౌజ్ నుండి 21.400 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మొత్తం 39.262 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తున్నారు.